శ్రీ తుంబురీశ్వర (జాతర) మహోత్సవము వాల్ పోస్టర్ ఆవిష్కరణ

టేక్మాల్(మెదక్ )ఫిబ్రవరి 01 తెలంగాణ వార్త ప్రతినిధి :- మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం టేక్మాల్ మండల పరిధిలోని వేల్పుగొండ గ్రామంలోని క్రీస్తు శకం 11వ శతాబ్దానికి చెందిన కాకతీయుల కాలంనాటి చారిత్రాత్మక కట్టడమైన శ్రీ తుంబురీశ్వర ఆలయ (జాతర) ఉత్సవాలను ప్రతి సంవత్సరం మగ శుద్ధ మాసంలో ఐదు రోజులపాటు నిర్వహిస్తారని ఈ జాతర మహోత్సవాల కరపత్ర వాల్ పోస్టర్ ను గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ పెద్దల సమక్షంలో వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు.ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం మగ శుద్ధ మాసంలో ఈనెల 09 నుండి మొదలుకొని 13 వరకు ఉత్సవాలు కొనసాగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్ గ్రామ పెద్దలు రాజ్ కుమార్, నర్సింలు, సంగయ్య, కృష్ణమూర్తి, శ్రీరాములు, విటల్, రమేష్ గౌడ్, రాములు,నారాయణ, అంజయ్య, బాలయ్య, వసంత్ కుమార్, లక్ష్మణ్ రాములు తదితరులు పాల్గొన్నారు.