శ్రీ తిమ్మప్ప స్వామిని దర్శించుకున్న జిల్లా ఎస్పీ
జోగులాంబ గద్వాల 13 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ శాఖ తగు బందోబస్తు చర్యలు తీసుకుంటుందని జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు దేవాలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి ఘనంగా స్వాగతం పలికి దేవాలయంలో అర్చనలు నిర్వహించారు. అనంతరం స్వామివారి శేష వస్త్రం బహుకరించారు. ఈ సందర్భంగా ఎస్పి పోలీస్ స్టేషన్ సందర్శించి జాతర ఏర్పాట్ల గురించి సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడారు. జాతరలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏర్పాట్లపై పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సత్యనారాయణ, సిఐలు టంగుటూరి శ్రీను, టాటా బాబు, ఎస్సై లు, సింగల్ విండో అధ్యక్షుడు తిమ్మారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, పట్వారి అరవందరావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు