సమస్యలను పరిష్కరించండి:సిపిఎం
జోగులాంబ గద్వాల 13 డిసెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల ప్రభుత్వ ఆసుపత్రులలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ.వెంకటస్వామి డిమాండ్ చేశారు, శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ CPM పార్టీ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ధరూరు గద్వాల మండలాలలోని PHCలు, వివిధ సబ్ సెంటర్ లను సందర్శించి సమస్యలపై అధ్యయనం చేశామని అన్నారు .సర్వే సందర్భంగా ప్రధానంగా వైద్య సిబ్బంది, మందులు, వైద్య పరికరాల కొరత, కొన్ని ఆసుపత్రులకు సొంత భవనాలు లేకపోవడం, మరికొన్నింటి ఆసుపత్రుల నిర్మాణాలను అసంపూర్తిగా వదిలేయడం, కనీస సౌకర్యాలైన ఇన్వెటర్ మంచినీరు, మరుగుదొడ్లు, ఆక్సిజన్ ప్లాంట్ ఆర్వో ప్లాంట్ లు అందుబాటులో లేకపోవడం, రోగుల సహాయకులకు విశ్రాంతి గదులు లేకపోవడం, కరెంట్ బిల్లులు పెండింగ్ లో ఉండడం, వంటి సమస్యలు ప్రధానంగా మా దృష్టికి వచ్చాయని అన్నారు జిల్లాలో ఆయుష్ ఆసుపత్రులకు సంబంధించి ప్రజలకు సమగ్రమైన అవగాహన లేకపోవడం వల్ల ఆసుపత్రులకు వెళ్లడం లేదన్నారు, ఆయుష్ ఆసుపత్రులలో సైతం సిబ్బంది కొరత ఉందన్నారు జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా ఆయుష్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు జిల్లా కేంద్రంలోని 300 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించి రోగులకు అందుబాటులోకి తీసుకురావాలని, అన్ని ప్రధాన విభాగాలకు వైద్యులను నియమించాలని డిమాండ్ చేశారు, పెరిగిన జనాభాకు అనుగుణంగా కొత్త PHC లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ ఆసుపత్రులలో నాణ్యమైన వైద్యం అందుబాటులో లేకపోవడం వల్లే ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారని, దీనిని ఆసరాగా చేసుకుని ప్రైవేటు కొంతమంది వైద్యులు విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల ప్రజల రోగనిరోధక శక్తిపై కూడా తీవ్ర ప్రభావం పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు పరిధికి మించి వైద్యం చేస్తున్న PMP, RMP ల పై చర్యలు తీసుకోవాలని కోరారు. వైద్యుని ని ప్రెస్క్రిప్షన్ లేకుండా, కనీస అర్హత లేకుండా మందులను విక్రయిస్తున్న ప్రైవేటు మెడికల్ షాపు యజమానులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి ప్రైవేట్ ఆసుపత్రి బయట డిస్ ప్లే బోర్డు (ఎంత మంది వైద్యులు అన్నారు,వారి అర్హతలు ఏమిటి, ఏ వ్యాధికి ఎంత ఖర్చు అవుతుంది) ఏర్పాటు చేయాలని రోగ నిర్ధారణ కేంద్రాలపై పర్యవేక్షణ పెంచాలని డిమాండ్ చేశారు .ఈ సమస్యల పరిష్కారం కోసం రెండు మండలాలలోని MRO లకు కూడా వినతిపత్రాలు అందజేశామని అన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల సమస్యలను పరిష్కరించి ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఉప్పేర్ నరసింహ ధరూర్ మండల నాయకులు మోష, మేకల నరసింహులు నాయకులు ఉదయ్ గంజీపేట ఆంజనేయులు రాము సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.