శాంతినగర్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

Apr 9, 2026 - 15:28
 0  0
శాంతినగర్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
శాంతినగర్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

దళారులను నమ్మి రైతులు నష్టపోవద్దు:

అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ విజయుడు. 

జోగుళాంబ గద్వాల 9 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :  వడ్డేపల్లి. మండలం శాంతినగర్ గ్రామంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ విజయుడు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడి, పంట నాణ్యతను పరిశీలించారు. మద్దతు ధరతోనే రైతుకు మేలు: అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు తాము కష్టపడి పండించిన పంటను తక్కువ ధరకు దళారులకు అమ్ముకొని నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకే రైతులు తమ పంటను విక్రయించుకోవాలని, తద్వారా ఆర్థికంగా బలోపేతం కావాలని ఆయన కోరారు.
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది


ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో రైతు సోదరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333