వైస్ చైర్మన్ పీఠం పై ఉత్కంఠ.....నేడే ప్రమాణ స్వీకారం

Feb 16, 2026 - 06:26
 0  266
వైస్ చైర్మన్ పీఠం పై ఉత్కంఠ.....నేడే ప్రమాణ స్వీకారం

మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పీఠం ఎవరిని వరించేనో.?

అక్కడే వైస్ చైర్మన్ ప్రకటన....?

వైస్ చైర్మన్ పదవి కై ఉత్కంఠ..

కో ఆప్షన్ సభ్యులుగా ఎవరు... 

నేడు చైర్మన్, వైస్ ఛైర్మన్ ల ప్రమాణ స్వీకారం…

 

తిరుమలగిరి 16 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

 మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పదవులు ఏ అభ్యర్థులకు వరిస్తాయో అని మున్సిపాలిటీ ప్రజలు సర్వత్రా చర్చించుకుంటున్నారు.  సూర్యాపేట జిల్లా  తిరుమలగిరి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు వెలువడడంతో అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్న బిఆర్ఎస్ పార్టీ ఎలాంటి ఎక్స్ అఫిషియో ఓట్లను వినియోగించుకోకుండానే చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు పొందే అవకాశం ఉంది. మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులకు గాను 10 వార్డులు బిఆర్ఎస్ అభ్యర్థులు గెలుచుకోవడంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సులువైంది. ఈనెల 16న చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు జరిగే ఎన్నికల్లో ఏ అభ్యర్థులకు ఏ పదవి వస్తుందోనని మున్సిపాలిటీ ప్రజలు సర్వత్ర చర్చించుకుంటున్నారు.

చైర్మన్ గా సంకెపళ్లి రఘునందన్ రెడ్డి ఏకగ్రీవమే..

మున్సిపాలిటీ చైర్మన్ పదవి జనరల్ కేటగిరికి రిజర్వేషన్ కావడంతో ఎన్నికలకు ముందు జరిగిన ఒప్పందంలో భాగంగా సంకెపల్లి రఘు నందన్ రెడ్డి చైర్మన్ అభ్యర్థిగా నిల్వనుండగా చైర్మన్ పదవి ఎవరు అనే అంశం పై మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఎన్నికలకు ముందే జనరల్ కేటగిరికి చెందిన అభ్యర్థులతో మాట్లాడి ఒక ఒప్పందానికి రావడంతో చైర్మన్ అభ్యర్థి ఎన్నిక ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు

అందరి దృష్టి వైస్ చైర్మన్ పదవి పైనే..

తిరుమలగిరి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం కావడంతో ఇప్పుడు అందరి దృష్టి వైస్ చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందోనని సర్వత్ర చర్చలు మొదలయ్యాయి. బిఆర్ఎస్ పార్టీ 10 వార్డులను కైవసం చేసుకోవడంతో అందులో రేసులో ఎస్సీ ముగ్గురు, బీసీ నలుగురు, జనరల్ అభ్యర్థులు చైర్మన్ అభ్యర్థితో పాటు మరో మహిళా అభ్యర్థి ఉన్నారు. చైర్మన్ అభ్యర్థి జనరల్ అవడంతో వైస్ చైర్మన్ పదవి ఎస్సీ సామాజిక వర్గానికి లేదా బీసీ సామాజిక వర్గానికి వచ్చే అవకాశం ఉంది. ఎస్సీ అభ్యర్థులు ముగ్గురు ఎన్నికవ్వడంతో అందులో ఇద్దరు ఎస్సీ మహిళా అభ్యర్థులు ఉండగా ఒకరు ఎస్సీ జనరల్ అభ్యర్థి ఎన్నికయ్యాడు. చైర్మన్ జనరల్ కావడం వల్ల వైస్ చైర్మన్ అభ్యర్థి ఎస్సీ కావాలి అనుకుంటే . ఈ కోణంలో ఆలోచిస్తే ఎస్సీ అభ్యర్థులలో మూడవ వార్డు మరియు 12 వ వార్డు అభ్యర్థి వైస్ చైర్మన్ గా నియమించే అవకాశం మెండుగా ఉంటుంది..

బీసీ అభ్యర్థిని వరించేనా..?

గత పాలకవర్గంలో వైస్ చైర్మన్ గా రెడ్డి సామాజిక వర్గం అభ్యర్థి చేయడంతో ఈసారి బీసీ జనరల్ అభ్యర్థికి వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలని అనుకుంటే మాత్రం ఒకటవ వార్డ్ బీసీ అభ్యర్థి మహిళ కావడంతో నాలుగోవ వార్డు, 11వ వార్డు అభ్యర్థులు బరిలో ఉంటారు. స్థానిక మాజీ ఎమ్మెల్యేకు దగ్గరగా ఉండే వార్డు అభ్యర్థికి వైస్ చైర్మన్ కట్టబెట్టే అవకాశం కూడా లేకపోలేదు.

నేడే ప్రమాణ స్వీకారం... 

తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు మున్సిపల్ కమిషనర్ రామచంద్రారావు తెలిపారు కార్యాలయం వద్ద ఎలాంటి ఆవాచనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలులో ఉన్నట్లు ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి