వేసవి నీ దృష్టిలో ఉంచుకుని మంచి నీటి ఎద్దడిని నివారణ చర్యలు చేపట్టాలి..

Feb 23, 2024 - 16:23
Feb 23, 2024 - 17:44
 0  3
వేసవి నీ దృష్టిలో ఉంచుకుని మంచి నీటి ఎద్దడిని నివారణ చర్యలు చేపట్టాలి..

నెమ్మాది వెంకటేశ్వర్లు
సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు

సూర్యాపేట:

రానున్న వేసవి నీ దృష్టిలో ఉంచుకుని మంచి నీటి ఎద్దడి నివారణకు తక్షణమే చర్యలు చేపట్టాలనీ CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు ఒక ప్రకటన లో ప్రభుత్వాన్ని కోరారు...

ఈ సవంత్సరం లో తీవ్రమైన ఎండలు ఉండబోతున్నాయి అని సంభిధిత అధికారులే ముందస్తు హెచ్చికలు చేస్తున్నారని కానీ నీటి ఎద్దడి కి తీసుకుంటున్న చర్యలు ఏమిటో ఇప్పటివరకు ప్రభుత్వం నుండీ ఏలాంటి ప్రకటనలు రాకపోవడం శోచనీయం అని అన్నారు.. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలలో 
కరువు కాటకాలు మరియు నీటి ఎద్దడికి ప్రత్యేక నిధులు కేటాయింపులు చేయక పోతే ఎలా అని నెమ్మాది ప్రశ్నించారు..

సూర్యాపేట జిల్లాలో పెన్ పహాడ్ మండలం లో ఇప్పటి కే కొన్ని గిరిజన ప్రాంతాల్లో మంచి నీళ్ళ కొరకు వ్యవసాయ బోరు బావులు దగ్గర నీళ్ళ కోసం బారులు తీస్తున్నారని నెమ్మాది అవేదన వ్యక్తం చేశారు...

గత తెలంగాణ టి ఆర్ ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ కొరకు వేల కోట్ల రూపాయలు కేటాయించారని దానిపై వందలాది మంది కార్మికులు పని చేస్తున్నపటికి మిర్యాల గూడెం అవంతి పురం ప్రాంతం లో నిత్యం పైపు లు లీకేజీల పరిస్థితి ఉందన్నారు... దీంతో మరమత్తులు కొరకు రోజుల తరబడి మరమత్తులు నోచుకోక పోవడం తో మున్సిపాలిీల్లో ఉన్న స్లమ్ ఏరియాలో పేద వర్గాలు తీవ్రమైన ఇబ్బందులూ ఎదుర్కుంటున్నారని ఆయన అవేదన వ్యక్తం చేశారు...

సూర్యాపేట పట్టణం లో నిత్యం
మంచి నీటి సరఫరా లో ఎదో రకంగా అంతరాయం కలుగుతుంది అనీ ఆన్నారు...

అట్లాగే దోసపాడు, మోతే మండలం నుండి వచ్చే మిషన్ భగీరథ నీటి సరఫరా కు నీటి నిల్వలు లేక పోవడం వల్ల మోతే మండలం లో మిషన్ భగీరథ నీటి సరఫరా చాలా కాలం నుండి గ్రామీణ ప్రాంతాల ప్రజలు నీటి సమస్యను ఎదుర్కొంటున్నారనీ నెమ్మాది తెలిపారు...

కాబట్టి సూర్యాపేట జిల్లా కలెక్టర్ నీటి సమస్య ఉన్న గ్రామాలను గుర్తించి వెంటనే ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయాలనీ నెమ్మాది కోరారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333