వెల్దేవి గ్రామంలో అన్నదాన కార్యక్రమం..అన్నదాత కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు మంటిపల్లి గంగయ్య

అడ్డగూడూరు 03 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వెల్దేవి గ్రామానికి చెందిన చౌళ్ళగూడెంలో మంగళవారం రోజు వినాయక మండపం వద్ద కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు మంటిపల్లి గంగయ్య కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.గ్రామంలోని ప్రజలందరూ వినాయకుని ఆశీస్సులు అందుకుని అన్న ప్రసాదం స్వీకరించారు.అన్నదానం చేసిన వ్యక్తికి వారి కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఆ గణేష్ ని ఆశీస్సులు ఉండాలని కమిటీ సభ్యులు అందరూ ప్రత్యేకంగా పూజ నిర్వహించినట్లు తెలిపారు.గ్రామంలోని ప్రజలు,రైతులందరూ పాడిపంటలతో సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో గ్రామ ప్రజలందరూ చల్లగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.అన్నదానం కార్యక్రమం నిర్వహించిన వంటిపల్లి గంగయ్య కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి సాల్వాతో చిరు సన్మానం చేసినామని వినాయక కమిటీ సభ్యులు తెలిపారు.అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించిన మంటిపల్లి గంగయ్య మాట్లాడుతూ..అన్ని దానాల కన్నా..అన్నదానం మిన్న..మానవసేవే.. మాధవసేవ..అన్నట్టుగా సంవత్సరానికి ఒక్కసారైనా ఈ సేవ చేయడంలో నాకుసంతృప్తి కలుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు,వినాయక కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.