వినూత్న శైలిలో గురుపూర్ణిమ

Jul 29, 2026 - 22:10
 0  0
వినూత్న శైలిలో గురుపూర్ణిమ

కె. ఆర్. ఆర్. ప్రభుత్వ జూనియర్ కళాశాల కోదాడలో గురు పూర్ణిమ సందర్భంగా విద్యార్థులకు "కెరీర్ గైడెన్స్" (వ్యక్తిత్వ వికాసం, వృత్తి విద్య లక్ష్యాల)పై సెమినార్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి సభాధ్యక్షత స్థానాన్ని కళాశాల ప్రిన్సిపాల్ నారు రమణారెడ్డి వహించి ఆయన మాట్లాడుతూ కళాశాలలో బోధనలో చేపడుతున్న వినూత్న పద్ధతులను వివరించారు. ముఖ్యఅతిథిగా ఇంటర్మీడియట్ విద్య మాజీ కమిషనర్ డి. చక్రపాణి పాల్గొని మాట్లాడుతూ... విద్యార్థులు ప్రతిరోజూ వార్తాపత్రికల ద్వారా, వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా, కాంపిటేటివ్ బుక్స్ ని అధ్యయనం చేయడం ద్వారా జ్ఞానంతో పాటు, జీవితంలో స్థిరపడవచ్చునని ఆయన అన్నారు. అలాగే మార్కెట్లో ఏ ఉద్యోగానికి ఎక్కువ డిమాండ్ ఉందో కూడా తెలుసుకోవచ్చు అన్నారు. అందుకోసం ఎలాంటి విద్య చదవాలి? నైపుణ్యాలను ఎలా పెంచుకోవాలి అనే విషయాలు తెలుస్తాయన్నారు.  వక్తగా పాల్గొన్న మద్రాస్ ఐఐటి కళాశాల ప్రొఫెసర్(ఆచార్యులు) శ్రీనివాస చక్రవర్తి పాల్గొని మాట్లాడుతూ... నేర్చుకోవాలి అనే సంకల్పం బలంగా ఉంటే గ్రామీణ నేపథ్యం, బీదరికం ఆటంకం కాదని, సోదాహరణంగా, సాధికారికంగా, సరళ శైలిలో వివిధ శాస్త్రవేత్తల అనుభవాలను, సినిమాలలోని విషయాలను, మంచి పుస్తకాలను ఉటంకిస్తూ అర్థవంతంగా  వివరించారు.విద్యార్థులు నూతన ఆవిష్కరణలకొరకు నిరంతరం ప్రయత్నిస్తూ విజయాన్ని సాధించాలని అన్నారు. కొత్త నైపుణ్యాల కోసం నిరంతరం శ్రమిస్తూ ఉండాలని అలా చేస్తే విజయం మీ సొంతమవుతుందన్నారు. ఎప్పుడూ నేర్చుకోవాలి అనే తపన,కోరికతో కలలు కనాలి, వాటిని నిజం చేసుకోవాలి అన్నారు. విశ్రాంత ప్రధాన ఆచార్యులు, ఆంగ్లోపన్యాసకులు పోతుగంటి నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్న స్థితి నుంచి అత్యున్నత స్థాయికి ఎదగడానికి మార్పును అస్త్రంగా మలచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333