వీధి కుక్కలు‌ నివారణకు చర్యలు తీసుకొండి

Feb 27, 2026 - 19:56
 0  0
వీధి కుక్కలు‌ నివారణకు చర్యలు తీసుకొండి

 జోగులాంబ గద్వాల 27 ఫిబ్రవరి 2026తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల్. మున్సిపాలిటి పరిధిలోని పలు వార్డులలో వీధి కుక్కల దాడులు అధికం అయ్యాయని, వీధి కుక్కల సమస్యను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం 2,3 వార్డులకు చెందిన ప్రజలు, కాలనీవాసులు గద్వాల్ మున్సిపల్ చైర్ పర్సన్ జయలక్ష్మీ  కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గద్వాల్ మున్సిపాలిటి రెండవ వార్డు, మూడవ వార్డుకు చెందిన సురేష్, శ్రీను, నరేష్ లకు చెందిన గేదెలు, మేకపిల్లలను వీధి కుక్కలు దాడి చేసి చంపేయడం జరిగిందన్నారు. ఒక్కో‌ రైతుకు రూ.60,000 అస్తినష్టం వాటిలిందన్నారు. వీధి కుక్కల బెడదతో ప్రజలు ఇబ్బందులు ఎదురుకుంటున్నారని, కాలనీలో చిన్నారులు ఆడుకోలేక పోతున్నారని, మహిళలు బయటికి వెళ్లాలంటే భయపడుతున్నారని వివరించారు. ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సురేష్, శ్రీను, నరేష్, సూరి, రంజిత్ కుమార్, పాండు, అఖిల్ రెడ్డి, పరమేష్, ధర్మవరం శ్రీనివాస్,రాజు, శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333