విద్యుత్ శాఖ వారి విజ్ఞప్తి
జోగులాంబ గద్వాల 2 జూలై 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల రేపు అనగ బుధవారం 02.07.2025 ఉదయం 09:00 గంటల నుండి 12:00 గంటల వరకు 33కేవీ Oilseed feeder కింద ఉన్న,లైన్ కు తాకే చెట్ల కొమ్మలను తొలగించటానికి లైన్ క్లియర్ తీసుకోవడం జరుగుతుంది .కావున ఆ సమయం లో పూడూరు వీరాపురం బీరెల్లి విద్యుత్ ఉపకేంద్రం పరిధి లోని గ్రామాలు బీరెల్లి లత్తిపురం తుర్కోన్పల్లి తెలుగోన్ పల్లి గుర్రం గడ్డ వీరాపురం అనంతపురం ఇండస్ట్రియల్ ఏరియా జమ్మిచేడు మేళ్లచెరువు పుటాన్పల్లి కొండపల్లి, బసల చెరువు, మేళ్లచెరువు గ్రామాలకు విద్యుత్ సరఫరా లో అంతరాయం ఉంటుంది అని తెలియజేయడం అయినది. కావున రైతులు మరియు గృహ,వాణిజ్య విద్యుత్ వినియోగదారులకు సహకరించగలరు విద్యుత్ శాఖ వారి విజ్ఞప్తి.