గంజాయి ముఠా అరెస్టు
గద్వాల ప్రతినిధి: గంజాయి రవాణ చేస్తూ విక్రయాలకు పాల్పడుతున్న ఓ ముఠాను జిల్లా పోలీసులు మంగళవారం అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వారి నుంచి 1.65 కిలోల గంజాయి, 3 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అరెస్ట్ వివరాలను గద్వాల డీఎస్పీ వై.మొగులయ్య మంగళవారం మీడియా సమావేశంలో వెల్లడించారు.
మహారాష్ట్ర నుంచి గద్వాల జిల్లాకు...
మహారాష్ట్రలోని సోలాపూర్, నుంచి రైలు ద్వారా తీసుకువచ్చి గద్వాల జిల్లాలో విక్రయిస్తున్నారు. గద్వాల, అయిజ పట్టణం తదితర ప్రాంతాలు, వ్యసనపరులైన యువకులు సరఫరా చేస్తున్నారు. ఆరు గ్రాముల పొట్లాలుగా మార్చి ఒక్కో పొట్లం రూ.500 చొప్పున విక్రయిస్తున్నారు.
పట్టుబడ్డ ముఠా వివరాలు
పోలీసులకు పట్టుబడిన వారిలో షేరేలీ వీధికి చెందిన భాషా మియ్యా, అయిజకు చెందిన పూర్ణ అంబదాస్, చాకలి పరుశరాముడు గా గుర్తించారు. మహారాష్ట్రలో గంజాయిని కొనుగోలుచేసి గద్వాల జిల్లాలో వ్యసనపరులకు విక్రయాలకు పాల్పడుతున్నారు.
గంజాయి, 3 సెల్ ఫోన్లు స్వాధీనం...
గంజాయి విక్రయ ముఠా సమాచారం అందుకున్న గద్వాల టౌన్ ఎస్ఐ కల్యాణ్ కుమార్ పోలీస్ సిబ్బంది రంగంలో దిగారు. మంగళవారం ఉదయం గద్వాల రైల్వే స్టేషన్ బ్రిడ్జీ కిందా ముఠా సభ్యులను అరెస్ట్ చేసి 1.65 కిలోల గంజాయి, 3 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, మాదక ద్రవ్యాలను ఎక్కడైనా విక్రయించినా, వినియోగించినా స్థానిక పోలీసులకు తెలియజేయాలని డీఎస్పీ సూచించారు. కాగ నిందితులను పట్టుకోవడంలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన గద్వాల టౌన్ ఎస్ కళ్యాణ్ కుమార్, కానిస్టేబుల్ చంద్రయ్య, వీరేష్, కిరణ్ లను గద్వాల డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో గద్వాల సీఐ టంగుటూరి శ్రీను , గద్వాల టౌన్ ఎస్ఐ కల్యాణ్ కుమార్, పట్టణ రెండవ ఎస్ఐ సతీష్ కుమార్ రెడ్డి, పట్టణ మూడవ ఎస్ఐలు జహంగీర్, తదితరులు పాల్గొన్నారు.