విద్యుత్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ప్రదర్శన

Aug 28, 2026 - 16:17
 0  2
విద్యుత్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ప్రదర్శన

లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుండి బషీర్ బాగ్ విద్యుత్ అమరుల స్థూపం వరకు తెలంగాణ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరిగిన ప్రదర్శన
బషీర్ బాగ్ అమరవీరులకు జోహార్లు తెలియజేస్తూ, విద్యుత్ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిద్దామని ప్రతిన బూనిన నేతలు.

మనన్యూస్, హైదరాబాద్:  ఆగస్ట్ 28, 2000 న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా కొనసాగిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హాయాంలో జరిగిన బషీర్ బాగ్ పోలీసు కాల్పులను తీవ్రంగా ఖండించారు.  ప్రపంచ బ్యాంకు ఆదేశాలతో ప్రజలపై మోయలేనో విద్యుత్ ఛార్జీలను పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ లక్షలాది మంది రైతులు, కార్మికులు, విద్యార్థులు, ప్రజాసంఘాలు ఛలో అసెంబ్లీకి తరలివచ్చి, ప్రజాస్వామ్య బద్దంగా, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై మఫ్టీలో ఉన్న పోలీసులే రాళ్ళు రువ్వి, రెచ్చగొట్టి,  ముగ్గురిని పోలీసు కాల్పులకు తెగబడడం అనేది అత్యంత దుర్మార్గమైన, అమానుష చర్యగా నేటికీ చరిత్ర పుటల్లో నిలిచిన ఘటనగా అభివర్ణించారు. 2026, ఆగష్టు-26, శుక్రవారం రోజు తెలంగాణ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో విద్యుత్ అమరవీరుల 26 ఏళ్ళ సంస్మరణ దినంగా పాటిస్తూ వామపక్షాలు సంయుక్తంగా పెద్ద ఎత్తున హైదరాబాద్ లోయర్ టాంక్ బండ్ వద్దగల అంబేద్కర్ విగ్రహం నుండి   బషీర్ బాగ్ విద్యుత్ అమరుల స్థూపం వరకు ప్రదర్శనగా వెళ్ళి, సభను నిర్వహించారు. ఇదే
హైదరాబాద్ బషీర్ బాగ్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజలపై పోలీసులు విచక్షణారహితంగా జరిపిన కాల్పులల్లో ముగ్గురు అమాయక యువకులు మరణించారని, వారికి పేరుపేరున విప్లవ జోహార్లు తెలియజేస్తున్నామని అన్నారు. వందలాది మంది గాయపడ్డారని గుర్తుచేశారు. వారి త్యాగం వృధా కాలేదని, ఆనాటి విద్యుత్ ఉద్యమం ప్రభుత్వం మెడలు వంచి,  ఛార్జీల పెంపును చంద్రబాబు వెనక్కి తీసుకునేలా చేసిందని పేర్కొన్నారు. నేడు 26 ఏళ్ల తర్వాత కూడ మళ్లీ అదే పరిస్థితులు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
స్మార్ట్ మీటర్ల పేరుతో పేదల నడ్డి విరుస్తున్నారని అదానీ, అంబానీ లాంటి బడా కార్పొరేట్ కంపెనీల నుండి అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసి, రైతులకు ఉచిత విద్యుత్ కు కోత పెడుతున్నారని ఆగ్రహించారు. కాబట్టి బషీర్ బాగ్ అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న రైతులకు నష్ట దాయకమైన విద్యుత్ సంస్కరణలను, చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, సంఘటితంగా ఉద్యమించి, తిప్పి కొట్టగలిగినప్పుడే, విద్యుత్ అమరులకు సమర్పించే నిజమైన విప్లవ నివాళి అవుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు విద్యుత్ ఛార్జీల పెంపును, స్మార్ట్ మీటర్లను వెంటనే రద్దు చేసి, ఆగస్ట్ 28ను విద్యుత్ వ్యతిరేక పోరాట దినంగా అధికారికంగా గుర్తించేలా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోదీ రైతు, కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని కోరారు. లేనియెడల తెలంగాణ ఉద్యమానికి ప్రేరణగా, పంజాబ్ రైతాంగం ప్రదర్శించిన ఉద్యమ పోరాట స్పూర్తితో సంపూర్ణ, స్వేచ్ఛ, సమానత్వం కొరకు, సమాన అవకాశాలు, విద్య, ఉపాధి, ఆరోగ్యం కొరకు దేశవ్యాప్తంగా మరో స్వతంత్ర పోరాటాన్ని చవిచూడాల్సి వస్తుందని  సిపిఐ ఈటేల నర్సింహ్మ, బోసు, సిపిఎం జాన్ వెస్లీ, సిపిఐ(ఎం.ఎల్) మాస్ లైన్ గడ్డం సదానందం, హన్మేష్, సిపిఐ(ఎం.ఎల్) న్యూడెమోక్రసీ ఝాన్సీ, అనురాధ, అరుణక్క, ఎం.సిపిఐ చంద్రశేఖర్, సిపిఐ(ఎం.ఎల్) కెమిడి ఉప్పలయ్య ఐ.ఎఫ్.టి.యు. షేక్ షావలి, పిఓడబ్ల్యూ సంధ్య, టియుసిఐ పద్మ తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333