విచక్షణ రహితంగా చితకబాదిన పోలీసులు

విచక్షణారహితంగా చితకబాదిన కొట్టిన ఇద్దరు కానిస్టేబుల్,ఎస్సై....
శరీరం కమిలేల తీవ్ర గాయాలు.....
నూతనకల్ పోలీసుల అత్యుత్సాహం...
దాదాపు 12 నిమిషాల పాటు 60 నుండి 70 లాఠీ దెబ్బలు....
రాత్రి మొత్తం స్టేషన్ లోనే జామిన్ పై పెద్దమనిషి వచ్చిన విడిచిపెట్టని వైనం..!
గాయాలు తట్టుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నం చేసిన బాధితుడు....
నూతనకల్ 02 జనవరి 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:- సూర్యపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలోని 31వ తారీకు రాత్రి సమయంలో తన సొంత ఇంటి ముందు నిలుచున్న కటురి రాము అనే వ్యక్తిని ఇద్దరు కానిస్టేబుళ్లు ఇక్కడ ఎందుకు నిలబడ్డావు అంటే మా ఇంటి దగ్గర నిలబడ్డాను అని సమాధానం ఇవ్వడంతో కానిస్టేబుల్లో ఆగ్రహానికి గురై ఆ వ్యక్తిని పోలీస్ వాహనం లో తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో విచక్షణారహితంగా చితకబాదిన సంఘటన నూతనకల్ మండల కేంద్రంలో జరిగింది. ఈ విషయాన్ని ఆ నోట ఈ నోట పడడంతో రాజకీయ నాయకులు రంగ ప్రవేశం చేసి జిల్లా ఉన్నతాధికారుల దగ్గరకు వెళ్ళనివ్వకుండా ఆపుతున్నట్లు సమాచారం వెంటనే ఇద్దరు కానిస్టేబుళ్లు ఎస్ఐపై చర్య తీసుకోవాలని బాధితులు ప్రజలు కోరుతున్నారు.