వాసవి క్లబ్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో"" 50 లక్షల సేవా కార్యక్రమాలు
తెలంగాణ వార్త నేలకొండపల్లి : వాసవి క్ల బ్ ఉమ్మడి ఖమ్మం జిల్లా సెకండ్ క్యాబినెట్ మీటింగ్ జిల్లా గవర్నర్ కొత్త వెంకటేశ్వరరావు గారి అధ్యక్షతన స్థానిక నేలకొండపల్లి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇరుకుల్లా రామకృష్ణ గారు విచ్చేశారు ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ , క్యాబినెట్ సెక్రటరీ, ట్రెజరర్, వైస్ గవర్నర్, ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్స్ , రీజియన్ చైర్మన్స్ , జోన్ చైర్మన్స్ , క్లబ్ అధ్యక్షులు కార్యదర్శులు కోశాధికారులు సుమారు 2 50 మంది హాజరయ్యారు అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల్లా రామకృష్ణ గారు మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు గడచిన ఆరు నెలలలో సుమారు 50 లక్షల రూపాయల సేవా కార్యక్రమాలు చేసినందుకు గవర్నర్ గారిని మరియు అధ్యక్షులను అభినందించారు జూలై నుంచి డిసెంబర్ లోపు మన వంతు స్వయంగా సమాజానికి ఉపయోగపడే పర్మనెంట్ ప్రాజెక్టులు చేయాలని సూచించారు వాసవి క్లబ్ నెంబర్ అయి ఉండి పూర్తి బీదవారు ఎవరైనా చనిపోతే 25000 దాన సంస్కారాలకి ఇస్తామని తెలియజేశారు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ నుంచి ఈ సంవత్సరం రెండు లక్షల నోట్ పుస్తకాలు అందజేశామని తెలియజేశారు జూలై 20 రాజమండ్రిలో జరిగే మిడ్ ఖాన్ ప్రోగ్రాం కి హాజరయ్యే క్లబ్ అధ్యక్షులకు సుమారు 1200 క్లబ్బులకు ఐదువేల రూపాయల చొప్పున సరస్వతీ పథకం కింద చదువుకునే వేద విద్యార్థుల పేరు మీద చెక్కులు అందజేస్తామని తెలియజేశారు నెలకొండపల్లిలో ఉన్నటువంటి వాసవి క్లబ్ గ్రేటర్ నేలకొండపల్లి అధ్యక్షులు డాక్టర్ నాగబండి శ్రీనివాస్ గారు స్థానిక నేలకొండపల్లి పోలీస్ స్టేషన్కి ఒక ఐరన్ బీరువా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సంతోష్ గా రికి అందజేశారు కపుల్స్ నెలకొండపల్లి అధ్యక్షులు కోదాడ నుంచి వచ్చే రోడ్లో సబ్ రోడ్డుకి నేలకొండపల్లి వెల్కమ్ బోర్డు ఏర్పాటు చేశారు, శ్రీ కన్యకా పరమేశ్వరి రాజేశ్వరపురం అధ్యక్షులు కొత్త శారదా దేవి రాజేశ్వరపురం కన్యకా పరమేశ్వరి దేవాలయమునకు నేలకొండపల్లి నుంచి వెల్కం బోర్డు ఏర్పాటు చేశారు, వనిత భక్త రామదాసు నెలకొండపల్లి అధ్యక్షురాలు కొత్త నవ్య భక్త రామదాసు మందిరమునకు వెల్కం బోర్డు ఏర్పాటు చేశారు, 20 23 నేలకొండపల్లి అధ్యక్షులు బో నగిరి రామసేసయ్య వెంకటేశ్వర స్వామి మరియు వైద్యనాథ స్వామి బౌద్ధ స్తూపానికి వెల్కం బోర్డు ఏర్పాటు చేశారు , 20 20 నేలకొండపల్లి అధ్యక్షులు కొత్త క్రాంతి కిరణ్ వదలకుండా రోడ్డుకి వెల్కం బోర్డు ఏర్పాటు చేశారు మరియు 15 మంది పేద విద్యార్థులకు 15 మంది అంగవైకల్యం చెందినవారికి నిత్యవసరానికి సంబంధించిన సరుకులు మరియు 15 మంది పేద విద్యార్థులకు 16500 రూపాయల ఆర్థిక సాయం ఈ ఆర్ క్లబ్ల గుడ్ విలు విజిట్ సందర్భంగా ఇంటర్నేషనల్ ఆఫీసర్ కడవెండి శోభారాణి శ్రీనివాస్ గార్ల జన్మదిన సందర్భంగా అందజేశారు వాసవి కుటుంబ సంరక్ష పథకం కింద కనుమర్ల పూడి రంగారావు గారికి లక్ష రూపాయలు కొత్త జనార్దన్ రావు గారికి నాలుగు లక్షల రూపాయలు వారి కుటుంబ సభ్యులకు అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ గారి చేతుల మీదగా జిల్లా గవర్నర్ కొత్త వెంకటేశ్వరరావు ఇంటర్నేషనల్ ఆఫీసర్ రేగూరి హనుమంతరావు గారు చేతుల మీదగా అందజేశారు రీజియన్ ఛైర్మన్స్ కొత్త రమేష్, తెల్లాకుల అశోక్, జోన్ చైర్మన్ దోసపాటి ఉషారాణి, అత్తులూరి నాగలక్ష్మి, డిస్టిక్ ఆఫీసర్స్ రేగురి వాసవి, దోసపాటి చంద్రశేఖర్, షరాబు పవన్, కో త్తా కరుణ, తెల్లాకుల జయశ్రీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వాసవి కళ్యాణ మండపం అధ్యక్షులు మా టూరి సుబ్రహ్మణ్యం ను జిల్లా గవర్నర్ మరియు అంతర్జాతీయ అధ్యక్షులు వారు చిరుసత్కారం చేసి అభినందించారు