వార్త తరంగాలు చైర్మన్ విజయరాజు పుట్టినరోజు వేడుకలు
జ్యోతి అనాధ వృద్ధుల ఆశ్రమంలో చైర్మన్ విజయరాజు పుట్టినరోజు వేడుకలు
ముఖ్యఅతిథిగా పాల్గొని కేక్ కట్ చేసిన జడ్పీ చైర్మన్ కంచర్ల
చైర్మన్ విజయరాజుకు చరవాణిలో శుభాకాంక్షలు తెలియజేసిన జడ్పీ చైర్మన్
కొత్తగూడెం జూలై 13( ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వార్త తరంగాలు స్టాప్ రిపోర్టర్ రత్నకుమార్ ఆధ్వర్యంలో వార్త తరంగాలు చైర్మన్ విజయరాజు పుట్టినరోజు వేడుకలు కొత్తగూడెంలో ముత్తాబాయి మెమోరియల్ వాలంటరీ ఆర్గనైజేషన్ వారి శ్రీ జ్యోతి అనాధ వృద్ధుల వికలాంగుల ఆశ్రమం హెడ్ ఆఫీస్ ఏరియా చమాన్ బస్తి లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు పాల్గొని కేక్ కటింగ్ చేసి వృద్ధులకు వికలాంగులకు భోజనాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎక్కడో ఉన్న చైర్మన్ పుట్టినరోజును ఇక్కడ అనాధల మధ్యల జరపడం చాలా సంతోషకరమైన విషయమని ఈ సందర్భంగా రత్నకుమార్ ని అభినందించిన జడ్పీ చైర్మన్. ప్రతి ఒక్క పుట్టినరోజు వేడుకలు వృద్ధాశ్రమాలలో అనాధాశ్రమాలలో నిర్వహించుకుంటే ఒకరోజు వారికి భోజనం పెట్టిన వారమవుతామని ఆ దీవెన ఎల్లకాలం మనకు మన తరాల వారికి ఉంటుందని వారు అన్నారు. కావున ప్రతి ఒక్కరూ మీ కుటుంబాలలో జరిగే పుట్టినరోజు పెళ్లిరోజు వేడుకలను వృద్ధాశ్రమం అనాధాశ్రమాలలో ఒక్క పూట భోజనం అందించి ఒక్క పూట వారితో గడిపి వారిని సంతోషపరచవలసిందిగా చైర్మన్ ప్రజలను కోరినారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గణేష్ కుక్కల శ్రీను జర్నలిస్ట్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.