వారంలోగా ధాన్యం కొనుగోలు పూర్తి కావాలి జిల్లా కలెక్టర్

May 19, 2026 - 21:42
 0  4
వారంలోగా ధాన్యం కొనుగోలు పూర్తి కావాలి జిల్లా కలెక్టర్

  వారంలోగా ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాన్ని పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

 

తిరుమలగిరి 20 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేసి, రానున్న వారం రోజుల్లో నిర్దేశిత కొనుగోలు లక్ష్యాన్ని పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన ఆత్మకూరు (ఎస్) మండల కేంద్రంలోని రైస్ మిల్లుతో పాటు, పాతర్లపాడు గ్రామంలోని అరోహి రైస్ మిల్లును సందర్శించి ధాన్యం నిల్వలు, మిల్లింగ్ ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. నూతనకల్ మండలంలోని ఎర్రపహాడ్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. మద్దిరాల మండల కేంద్రం మరియు గుమ్మడివల్లి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. తుంగతుర్తి: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలోని కొనుగోలు కేంద్రంతో పాటు, వెంపటి గ్రామం, రావులపల్లి ఎక్స్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాలను తనిఖీ చేశారు.

తిరుమలగిరి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఏ ఎస్ ఆర మిల్లును సందర్శించారు నాగారం మండలం ఈటూరి గ్రామంలోని 'సోమేశ్వర రైస్ మిల్లు'ను సందర్శించి అన్‌లోడింగ్ సామర్థ్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో అన్ని శాఖల అధికారుల సమన్వయంతో కొనుగోలు చేసిన ధాన్యాన్ని వేగంగా అన్‌లోడింగ్ చేస్తున్నట్లు తెలిపారు. ధాన్యం దిగుమతి ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం జరగకుండా ఉండేందుకు వీలుగా, పెద్ద ఎత్తున అన్‌లోడింగ్ పాయింట్లను గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. రానున్న వారం రోజులు అత్యంత కీలకమని కాబట్టి అధికారులు, మిల్లుల యజమానులు సమన్వయంతో పనిచేసి లారీలను వేగంగా అన్‌లోడ్ చేయించాలని ఆదేశించారు.

 కలెక్టర్ వెంట ఆత్మకూర్ (ఎస్) తహసిల్దార్ హమీసింగ్, తిరుమలగిరి తహసిల్దార్ హరిప్రసాద్ నూతనకల్ తహసిల్దార్ శ్రీనివాసరావు, మద్దిరాల తహసీల్దార్ తబిత, వ్యవసాయ శాఖ ఎ ఓ రుహి, తుంగతుర్తి తాసిల్దార్ దయానంద్ ఎంపీడీవో శేషు కుమార్, ఏ డి ఏ రమేష్ బాబు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి