వసతి గృహంలో అనుకూల వాత వర్ణాన్ని కల్పించి విద్యార్థుల అభివృద్ధి కోసం అన్ని అవసరమైన చర్యలు చేపట్టాలి కలెక్టర్

జోగులాంబ గద్వాల 19 ఆగస్టు 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఎర్రవల్లి వసతి గృహంలో అనుకూల వాతావరణాన్ని కల్పించి, విద్యార్థుల అభివృద్ధి కోసం అన్ని అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ అన్నారు. మంగళవారం ఎర్రవల్లి మండలం ధర్మవరం గ్రామంలో ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహాన్ని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు.
ఈ సందర్భంగా వసతి గృహం, వంటశాల, స్టోర్ రూమ్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన విద్య పౌష్టికాహారంతో పాటు సురక్షిత నివాసం కల్పించడమే ప్రభుత్వా ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ స్పష్టం చేశారు. విద్యార్థులు నివసిస్తున్న గదుల పైకప్పు పెచ్చులు కొడుతున్న పరిస్థితిని గమనించి, విద్యార్థులకు ప్రమాదం జరగకుండా గదుల మరమ్మతులు పూర్తయ్యే వరకు విద్యార్థులను తాత్కాలికంగా పాఠశాలలోనే వసతిని కల్పించాలని వార్డెన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఆదేశించారు.పాఠశాల భవన నిర్మాణాన్ని సాంకేతికపరంగా పరిశీలించి, భవనంకు అవసరమైన మరమ్మతులపై అంచనా నివేదిక వెంటనే సమర్పించాలని ఇంజినీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. విద్యార్థులకు అందించే ఆహార నాణ్యతపై కూడా ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. వార్డెన్ ప్రతిరోజూ హాస్టల్‌కి హాజరు కావాలని, విద్యార్థుల అవసరాలు, సమస్యలు,వసతి గృహంలో ఉన్న పరిస్థితులను ప్రత్యక్షంగా పర్యవేక్షించాల్సిందిగా ఆదేశించారు. మెనూను కచ్చితంగా పాటిస్తూ, పోషకాహారంతో కూడిన మంచి భోజనాన్ని విద్యార్థులకు అందించాలని, వర్షాలు కురుస్తున్నందున స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని సూచించారు. విద్యాభివృద్ధి కోసం ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపి, అన్ని రంగాలలో వారిని మరింత అభివృద్ధి చెందేలా మార్గనిర్దేశనం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో బి.సి సంక్షేమ అధికారి నిశిత, పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మి రెడ్డి, వార్డెన్ జయరాములు, తదితరులు పాల్గొన్నారు.
-----------------------