* భారీ వర్షాల కారణంగా వాగుల్లో నీటి ప్రవాహం తీవ్రమైందని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణంసహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్

Aug 19, 2025 - 19:12
 0  15
* భారీ వర్షాల కారణంగా వాగుల్లో నీటి ప్రవాహం తీవ్రమైందని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణంసహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్

 జోగులాంబ గద్వాల19 ఆగస్టు 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి :  మానవపాడు. భారీ వర్షాల కారణంగా వాగులో నీటి ప్రవాహం తీవ్రమైందని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ సూచించారు. మంగళవారం మనోపాడ్ మండలంలోని నారాయణపురం గ్రామంలో రైల్వే అండర్ పాస్ వద్ద నిలిచిన నీటిని పరిశీలించారు. 


ఈ సందర్భంలో అండర్ పాస్ దాటడం ప్రమాదకరంగా ఉంటుందని పేర్కొంటూ, అక్కడి నీటిమట్టాన్ని తగ్గించేందుకు మోటార్ పరికరాలు ఉపయోగించి నీటిని తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.నీటి మట్టం మరింత పెరిగిన సందర్భంలో, ప్రజలు సురక్షితంగా గ్రామానికి చేరుకునేందుకు డైవర్షన్ రోడ్డు ఏర్పాట్లు చేసి,ఇతర మార్గం ద్వారా రాకపోకలు సులభం చేయాలని సూచించారు.
అండర్‌పాస్ వద్ద పోలీసు, రెవెన్యూ సిబ్బంది ప్రమాదాల సంభవించకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు. శాశ్వత పరిష్కారాన్ని త్వరలోనే అమలు చేస్తామని అన్నారు. ప్రజలు భారీ వర్షాల వల్ల ప్రమాదాల సంభవించకుండా జాగ్రత్తలు పాటించాలని, 
అవసరమైతే అధికారుల సహకారం పొందాలని కలెక్టర్ సూచించారు. ప్రజల భద్రత కోసం జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని కలెక్టర్ తెలిపారు. 

  ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్ జోషి, ఎస్.ఐ చంద్రకాంత్, తదితరులు పాల్గొన్నారు. -

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333