వడదెబ్బకు గురికాకుండా వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలి:అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్
జోగులాంబ గద్వాల 8 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఐడిఓసిలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముద్రించిన కరపత్రాలను వైద్యాధికారులతో కలిసి అదనపు కలెక్టరు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు, ఇతర సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ ఈ కరపత్రాలను ప్రజలకు అందజేయాలన్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఇతర అవసరమైన మందులను కొరత లేకుండా సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పి గుణశేఖర్, ఇన్చార్జి డిఎంహెచ్వో డాక్టర్ శశికళ, డిఆర్డిఓ నర్సింగ్ రావు, ఆర్డీవో రామచందర్, డిపిఓ వెంకట్ రెడ్డి, డాక్టర్ సుమిత్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.