వక్కా పంట రైతన్నల ఇంట "సిరుల పంట"వక్క సాగును పరిశీలించిన తుమ్మల

Oct 13, 2024 - 19:03
Oct 13, 2024 - 20:38
 0  202
వక్కా పంట రైతన్నల ఇంట "సిరుల పంట"వక్క సాగును పరిశీలించిన తుమ్మల
వక్కా పంట రైతన్నల ఇంట "సిరుల పంట"వక్క సాగును పరిశీలించిన తుమ్మల

వక్క పంట రైతన్నల ఇంట "సిరుల" పంట

వక్క సాగును పరిశీలించిన మంత్రి తుమ్మల 

ఏలూరు జిల్లా కామవరపు కోటలో మంత్రి పర్యటన 

రైతుల అనుభవాలు విజయ రహస్యాలను తెలుసుకున్న మంత్రి 

అంతర పంటల సాగుతో లక్షల్లో ఆదాయం

తెలంగాణలో వక్క సాగుకు అనువైన ప్రాంతం 

నిపుణులతో చర్చించి సాగుపై నిర్ణయం:మంత్రి తుమ్మల

వక్క పంట సాగు రైతన్నల వెంట సిరులు కురిపిస్తుందని , తెలంగాణలో సైతం వక్క పంటల సాగును ప్రోత్సహిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం ఏలూరు జిల్లా కామవరపు కోటలో వాణిజ్య పంటలైన వక్క సాగును పరిశీలించారు. ఈ సందర్భంగా వక్క సాగు రైతులతో సాగు పద్ధతులు ఆదాయ వ్యయాలపై రైతులతో సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణలో వక్కసాగు విస్తరణ అంశాలు, అవకాశాలపై నిపుణులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ

వక్క సాగుతో రైతులు లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నారన్నారు. అనేక మంది రైతులు కొబ్బరి, పామాయిల్ తోటలలో అంతర్పంటలుగా సాగు చేస్తూ అధిక లాభాలు అర్జిస్తున్నారని వివరించారు. అన్నదాతలు ఆధునిక సాగు వైపు అడుగులు వేయాలని , అధిక ఆదాయం పొందేందుకు ఈ పంటలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. అనేకమంది రైతులు పోక, వక్క, తోటల్లో అంతర పంటలతో రైతులు అద్భుతాలు చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వచ్చే పంటలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వక్క సాగు అనుకూల నేలలు,వాతావరణ పరిస్థితులు , నీటి వినియోగం తదితర అంశాలపై నిపుణులతో చర్చించి సాగును ప్రోత్సహించినట్లు మంత్రి పేర్కొన్నారు. వక్క సాగు చేస్తున్న అనేకమంది రైతులు నుంచి అనూహ్య స్పందన లభించిందని, సాగు చాలా ఆశాజనకంగా ఉందని రైతుల పేర్కొన్నట్లు మంత్రి వివరించారు. తెలంగాణ రైతాంగాన్ని రాజును చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తుందని, రైతన్నలు శ్రేయస్సు కు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State