లికపై లైంగిక దాడి - నిందితుడికి 10 ఏళ్ల కఠిన జైలు శిక్ష , రూ.10,000/- జరిమానా
నేరస్తునికి శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు, ఐపిఎస్...
జోగులాంబ గద్వాల7 జూలై 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : మైనర్ బాలిక పై బలత్కారం చేసిన కేసులో నిందితుడికి 10 సంవత్సరాల కఠిన కారాగారా జైలు శిక్ష మరియు 10,000/- రూపాయాల జరిమాన విధిస్తూ * *స్పెషల్ సెషన్స్ జడ్జ్ - కం- ఫోక్సో కోర్టు గద్వాల, జడ్జ్ శ్రీ వి. శ్రీనివాస్ ఈ రోజు తీర్పును వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు, ఐ.పి.ఎస్., తెలిపారు. వడ్డేపల్లి మండలలో ఒక గ్రామమనికి చెందిన, ఒక మైనర్ బాలిక తల్లి తేది: 01.01.2021 రోజున శాంతినగర్ పోలీస్ స్టేషన్ కు వచ్చి అదే రోజున మైనర్ అయిన తన కూతురుపై వడ్డేపల్లి మండలంలోని ఒక గ్రామానికి చెందిన ఒక వ్యక్తి నడిపి తిమ్మప్ప s/o మునక తిక్కయ్య, వయసు 38 సంవత్సరాలు, కులం: బోయ, వృత్తి: కూలి, అను అతను బలాత్కారం చేసి అత్యాచారం చేసినట్టు పిర్యాదు ఇవ్వగా అప్పటి శాంతినగర్ ఎస్సై శ్రీహరి కొండ, క్రైమ్ నెo. 01/2021, u/s: 366-A, 376(2)(2)(j) మరియు 376(2)(l)IPC &sec 5(k), 6 of POCSO Act -2012 గా కేసు నమోదు చేయడం జరిగింది. అప్పటి సిఐ. జె. వెంకటేశ్వర్లు తేది: 22-09-2021 రోజున పై నేరస్థుడుని రిమాండ్ పంపి, విచారణ పూర్తి చేసి తేది: 23-10-2021 రోజున కోర్టు లో చార్జి షీట్ వెయ్యడం జరిగింది.
కోర్టు లో ట్రయల్స్ నడుస్తున్న సమయంలో జిల్లా అదనపు ఎస్పీ శ్రీ కె. శంకర్ ఆదేశాల మేరకు డి.ఎస్పి. వై. మొగిలయ్య పర్యవేక్షణలో, శాంతినగర్ సీఐ శంకర్, నాగశేఖర్ రెడ్డి, గద్వాల భరోసా కేంద్రం బృందం సాక్షులను పకడ్బందీగా బ్రీఫింగ్ చేసి తగిన చర్యలు తీసుకొని నేరస్తులను కోర్టులో ప్రవేశపెట్టగా పూర్వపరాలను విన్న స్పెషల్ సెషన్స్ జడ్జ్ - కం- ఫోక్సో కోర్టు గద్వాల, జడ్జ్ శ్రీ వి. శ్రీనివాస్. నిందితుడుకి 10 సంవత్సరాల కఠిన కారాగర శిక్ష జైలు శిక్ష మరియు 10,000/- వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
కోర్టులో నిందితుడికి శిక్షపడేలా కృషి చేసిన అప్పటి ఐ.ఓ. లు శ్రీహరి కొండ ఎస్సై జె వెంకటేశ్వర్లు సిఐ, ప్రస్తుత గద్వాల డి. ఎస్పీ మొగిలయ్య, శాంతినగర్ సీఐ శంకర్, శాంతినగర్ ఎస్సై నాగ శేఖర్ రెడ్డి, అడిషనల్ పిపి. కె.విజయ్ కుమార్, గద్వాల భరోసా కేంద్రం బృందం మరియు కోర్టు డ్యూటీ అధికారులు ఎస్సై జిక్కి బాబు, హెడ్ కానిస్టేబుల్ సాయిబాబా, డ్యూటీ కానిస్టేబుల్ గౌస్ పీర్ లను జిల్లా ఎస్పీ శ్రీ టి.శ్రీనివాస రావు, ఐపిఎస్.,. అభినందించారు.