- లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్య నేరం.

May 24, 2025 - 21:29
 0  5
- లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్య నేరం.

సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం, తేది : 24/05/2025 ప్రోత్సహించిన సహకరించిన చట్టపరమైన  కఠిన శిక్షలు తప్పవు.
- స్కానింగ్ సెంటర్స్, హాస్పటల్ లపై నిఘా ఉంచాం.
- పోలీస్ స్పెషల్ టీమ్స్ పని చేస్తున్నాయి.
- తల్లిదండ్రులు అపోహలు వీడాలి. 

....నరసింహ ఐపిఎస్,  ఎస్పి సూర్యాపేట జిల్లా.

మాతృత్వం అనేది ఒక వరం, ఆడ మగ అనేది తేడా లేకుండా ఆడ శిశువు మనుగడకు, అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆడ మగ అనేది తేడా లేదు, తల్లిదండ్రులు అపోహలు వీడాలని జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ గారు ప్రకటనలో అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ స్త్రీ గర్భంలో ఉన్నది ఆడ లేదా మగ శిశువు అనేది తెలుసుకోవడానికి లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం, ఆడ శిశువు భ్రూణ హత్యలకు పాల్పడం అత్యంత నేరం, ఇలాంటి వాటికి పాల్పడితే కఠిన శిక్షలు తప్పవు హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు ప్రాథమిక వైద్యం అందిస్తూ ప్రాణ రక్షకులుగా ఉండాల్సిన RMP లు వారి బాధ్యత మరవద్దు, లింగ నిర్ధారణ కు ప్రోత్సహించవద్దు, ఆడ శిశు భ్రూణ హత్యలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి అని తెలిపినారు. పోలీసు శాఖ ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసి నిఘా పెంచాం,  స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు, హాస్పటల్ వైద్యులు ఇలాంటివి చేయవద్దు అని కోరారు. ఇలాంటి పరీక్షలు నిర్వహించిన, ప్రోత్సహించిన, సహకరించిన అలాంటి వారి అందరిపై చర్యలు ఉంటాయి. ప్రీ-నేటల్ డయాగ్నస్టిక్ టెక్నిక్స్ చట్టం మరియు నూతన చట్టాల ప్రకారం అత్యంత కఠిన శిక్షలు ఉంటాయి అని హెచ్చరించారు. 10 సంవత్సరాల పైబడి కఠిన జైలు శిక్ష, జరిమానా ఉంటుంది అన్నారు. ఇలాంటి వాటిపై స్థానిక పోలీసులకు, డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని అన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333