రైల్వే డంప్లింగ్ పనులకు భూసేకరణ పూర్తి చేయాలి.

Jul 8, 2026 - 16:32
Jul 8, 2026 - 17:11
 0  16
రైల్వే డంప్లింగ్ పనులకు భూసేకరణ పూర్తి చేయాలి.
రైల్వే డంప్లింగ్ పనులకు భూసేకరణ పూర్తి చేయాలి.

జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్.

జోగులాంబ గద్వాల 8 జూలై 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- రైల్వే డంప్లింగు పనులకు భూ సేకరణ పూర్తి చేయాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్. సంబంధిత అధికారులకు ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ఇరిగేషన్ మరియు రైల్వే లైన్ పనులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియపై బుధవారం ఢిల్లీ నుంచి ఉన్నతాధికారులు సంబంధిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పాల్గొనగా జోగులాంబ గద్వాల కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ మాట్లాడుతూ. మహబూబ్నగర్ నుంచి డోన్ వరకు చేపడుతున్న డంబ్లింగ్ రైల్వే లైను పనులకు జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలో 104 ఎకరాల భూమిని సేకరించుదమన్నారు. ఇప్పటికే సంబంధిత రైతుల నుంచి భూ సేకరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్నందున త్వరలోనే అవార్డు పూర్తిచేయాలని అన్నారు. అవార్డు పూర్తికాగానే రైల్వే అధికారులకు ఈ భూమిని అప్పగించడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కృష్ణ. జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ రామలింగేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State