రైతు రుణమాఫీ పై బిఆర్ఎస్ ధర్నా చేయడం సిగ్గుచేటు.బయ్యం వెంకన్న

నాగారం ఆగస్టు 24:- రైతు రుణమాఫీ విషయం పై బి ఆర్ ఎస్ పార్టీ ధర్నాలు నిర్వహించడం సిగ్గుచేటు అని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు బయ్యం వెంకన్న శనివారం పత్రిక ప్రకటనలో తెలిపారు. పది సంవత్సరాలు పాటు అధికారంలో ఉండి రైతు రైతు రుణమాఫీని గాలికి వదిలేసి కేవలం కేవలం కొద్ది రైతులకి మాత్రమే రుణమాఫీ చేసి జబ్బలు చరుచుకున్నారని ఎద్దేవా చేశారు. పది సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పనిని 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసి చూపించారని కొనియాడారు. రుణమాఫీ కానీ రైతులందరికీ రుణం మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని బిఆర్ఎస్ నాయకులు మర్చిపోవడం వారి మతిమరుపు నిదర్శనమని అన్నారు.గతం లో మీ ప్రభుత్వం చేసిన రుణమాఫీ వడ్డీకి సరిపోలేదని అన్నారు. రైతు కళ్ళల్లో ఆనందాన్ని చూడడం కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ఇకనైనా కళ్ళు తెరిచి రైతుల సంక్షేమానికి మద్దతు ఇవ్వాలని లేకపోతే రానున్న స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.