రైతుల కోసం పోరాడిన ఉద్యమకారుడు మల్లారెడ్డి
తిరుమలగిరి 28 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- తిరుమలగిరి జ్యోతిరావు పూలే అంబేద్కర్ చౌరస్తాలో జి ఎం పి ఎస్ సామాజిక తెలంగాణ ఆధ్వర్యంలో మల్లారెడ్డి సంతాప సభ నిర్వహించారు ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జిఎంపిఎస్ రాష్ట్ర కమిటీ నాయకులు కడెం లింగయ్య మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం సాగు తాగునీరు సమస్య పరిష్కారం కోసం రైతుల పట్ల నిరంతరం పోరాటాలు నిర్వహించిన చరిత్ర కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి కి ఉన్నది మన ప్రాంతంలో శ్రీరాంసాగర్ కాల్వ నిర్మాణం కోసం భీమ్ రెడ్డి నరసింహారెడ్డి సారంపల్లి మల్లారెడ్డి మల్లు స్వరాజ్యం కాసం కృష్ణమూర్తి ఆధ్వర్యంలో వరంగల్ ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతుల సమీకరించి అనేక కార్యక్రమాలు నిర్వహించి శ్రీరామ సాగర్ కాల్వ సాధించిన చరిత్ర సారంపల్లి మల్లారెడ్డి కె దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక తెలంగాణ రాష్ట్ర నాయకులు కొత్తగట్టు మల్లయ్య, ఎమ్మార్పీఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు కందుకూరి సోమయ్య, రజక సంఘం మండల నాయకులు పులిమామిడి సోమయ్య, సిఐటియు మండల నాయకులు ఎస్ఎఫ్ఐ ఉద్యమ నాయకులు పులిమామిడి భిక్షం, కందుకూరి వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.