రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని

 జిల్లా వ్యవసాయాధికారి పి. శ్రవణ్ కుమార్ 

Apr 3, 2025 - 19:01
 0  4
రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని
రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని

తెలంగాణ వార్త మాడుగులపల్లి ఏప్రిల్ 3 :  మాడుగులపల్లి మండల కేంద్రంలో పిఎసిఎస్  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ అధికారిఆకస్మికంగా తనిఖీ చేసి తేమ శాతన్ని పరిశీలించారుఈ సందర్బంగా మాట్లాడుతు  ప్రభుత్వం వరి A గ్రేడ్ రకానికి క్వింటాల్ కి రూ 2320/- గాను,సాధారణ రకానికి రూ 2300/- గాను కనీస మద్దతు ధర  నిర్ణయించడం జరిగిందని ఆయన తెలియచేసారుఅంతే కాక తెలంగాణ ప్రభుత్వం రైతులు పండించిన సన్న ధాన్యానికి ప్రోత్సహకంగా క్వింటాల్ కి  రూ 500/- లు బోనస్ ప్రకటించడం జరిగిందని ఆయన తెలియచేసారుకావున రైతులందరు కూడా కనీస మద్దతు ధరను పొందాలంటే తప్పనిసరిగా నాణ్యత ప్రమాణలను పాటించాలని తేమ శాతం 17% ఉండేవిధంగావడ్లలో  తాలు లేకుండా చూసుకోవాలని ఆయన తెలియచేసారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి యం.శివరాం కుమార్,వ్యవసాయ విస్తరణ అధికారులు జి. శిరీష, వేణుగోపాల్, పార్వతి మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333