పొంచి ఉన్న ప్రమాదం
ఇల్లు కట్టడానికి పిల్లర్స్ గుంతలు తిసి వదిలిపెట్టారు
గతంలో ఒకసారి ప్రమాదం.మరోసారి ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టాలి - వార్డు ప్రజలు
జోగులాంబ గద్వాల 10 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల జిల్లా కేంద్రంలోని అనంత హాస్పిటల్ ఆపోజిట్ పార్క్ ప్రక్కన ఆరు నెలల క్రితం ఇల్లు కట్టుకోవడానికి పిల్లర్స్ గుంతలు తియడం జరిగింది. ఆ స్థలంలో ఇల్లు నిర్మాణం చేపట్టకపోవడంతో ఇప్పటివరకు ఆ గుంతలు అలాగే ఉండి ఆ గుంతలో నీరు నిండిపోవడం జరిగినది. పది రోజుల కిందట 5 సంవత్సరాల బాబు ఆడుకుంటూ ఆ నీరు నిండి ఉన్న గుంతలో పడిపోవడం జరిగింది. సమయానికి బాబు తండ్రి అక్కడే ఉండి గమనించడంతో ప్రమాదవశాత్తు ఏమి జరగలేదు. పిల్లర్స్ గుంతల వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు దీనికి బాధ్యులు అని కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు.? దయచేసి ఆ వార్డు కౌన్సిలర్ గాని లేదా మున్సిపాలిటీ అధికారులు కానీ స్పందించి అట్టి గుంతలను పూర్చివేయాలని ఆ వార్డు ప్రజలు కోరుతున్నారు . ఏలాంటి ప్రమాదం జరగకుండ అధికారులు స్పందించాలని వార్డు ప్రజలు కోరుతున్నారు