రేషన్ కార్డుల పంపిణీ జరగబోతుంది

Mar 23, 2025 - 19:36
Mar 23, 2025 - 20:34
 0  7

హుస్నాబాద్ 23 మార్చ్ 2025 తెలంగాణవార్త ప్రతినిధి.

హుస్నాబాద్ IDOC లో హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి పై రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం ప్రారంభం.

సమావేశంలో పాల్గొన్న సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ మూడు జిల్లా అడిషనల్ కలెక్టర్లు ,మండల అధికారులు , పంచాయతీ సెక్రటరీ లు.

అధికారులతో సమీక్షా సమావేశం లో మంత్రి పొన్నం ప్రభాకర్ 

వేసవి కాలం సమీపిస్తుండటంతో గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక పారదర్శకంగా జరగాలి పేదలకు ప్రాధాన్యత ఇవ్వాలి

వరి కోతలు జరుగుతున్నాయి.. కొనుగోలు కేంద్రాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి

రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభం అయిన నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ల అప్లికేషన్ లు తదితర అంశాలపై చర్చ

రేషన్ కార్డుల పంపిణీ జరగబోతుంది

ఉగాది నుండి నల్గొండ జిల్లాలో సన్న బియ్యం పంపిణీ జరుగుతుంది.

.గ్రామాల్లో మంచి నీటి సమస్య రావద్దు..ఏదైనా సమస్య వస్తె ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలి. సమస్య మీరు పరిష్కారం చేయకుండా మా దృష్టికి తెకుండా ప్రొటెస్ట్ చేస్తే మీరే బాద్యులు. గ్రామాల్లో వేసవి కాలం అధిగమించడానికి టెంపరరీ గా బావులు తీసుకోవాలి అక్కడ మోటార్లు పెట్టీ పైపులు వేయాలి అవసరమైతే వాటర్ ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలి. ఎంత ఇబ్బంది అయినా మేము పరిష్కారం చేస్తాం

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333