రేపటి నుండి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పున: ప్రారంభం..

Jun 11, 2024 - 20:07
 0  9

హైదరాబాద్:జూన్ 11: తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 23 నుండి విద్యార్థులకు పాఠశాలలకు సెలవులను ప్రకటించారు. ఆనాటి నుండి ఈరోజు వరకు ఆటపాట లతో సరదాగా ఆడుకుంటూ పాడుకుంటూ ఉన్నా విద్యా ర్థులు ఇక రేపటి నుండి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల లు పున:ప్రారంభం కాను న్నాయి. 

దీంతో విద్యార్థులందరికీ రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న విద్యా సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్నాం. పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్ లు ప్రభుత్వ పాఠశాలల్లో సిద్ధంగా ఉన్నాయి.

బుధవారం రోజున శుభ్రంగా తలస్నానం చేసి,  నచ్చిన ఉతికిన బట్టలు వేసుకుని పాఠశాలకు  రావాలని అధ్యాపకులు విద్యార్థులకు పిలుపునిచ్చారు. 

విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన కొన్ని అంశాలు.

విద్యార్థులు పాఠశాలకు వెళ్లే ముందు తమ గోర్లను కత్తి రించుకోవాలి. తల వెంట్రుక లను శుభ్రపర చుకోవాలి. చక్కగా దువ్వుకోవాలి. రాగి జావా, మధ్యాహ్న భోజనం ప్రభుత్వ పాఠశాలల్లో ఉంటాయి.

కనుక తినడానికి పళ్లెం, తాగడానికి గ్లాసు మనతో పాటు వెంట తెచ్చుకోవాలి. వెళ్లేటప్పుడు కొత్త పుస్త కాలు, కొత్త నోట్ బుక్స్ , యూనిఫాం ఇంటికి తీసుకెళ్లాలి కదా..

అందుకే బోలెడన్ని  పుస్త కాలు, నోట్ బుక్స్ మోసు కుని రావటం వద్దు.ఒక రఫ్ నోట్ బుక్ ,పెన్ను మాత్రం తెచ్చుకోవాలి. మరి ఇన్నాళ్లు నేర్చుకున్నవి మరొకసారి మననం చేసుకోవాలి కదా. అందుకని...

విద్యార్థులతో పాటు తప్పని  సరిగా తల్లి లేదా తండ్రి రావాలి. వారి సంతకం తీసుకుని.. పుస్తకాలు నోట్ బుక్స్, యూనిఫామ్  ఇవ్వ బడతయని అధ్యాపకులు ఇప్పటికే ప్రకటించారు.

బడి కి విద్యార్థులు…వారి తల్లితండ్రులే ప్రచార కర్తలు.మీ చుట్టుపక్కల వారి పిల్లలు బడిలో చేర్చేలా ప్రోత్సహించండి.ఇంకా బడిని సమర్థవంతంగా నడుపుకునేలా సూచనలు, సలహాలు  ఇవ్వాలని పేర్కొన్నారు.

బడి మనది…బడి బాధ్యత మనది.మనం ఎదగడానికి బడి..బడి బాగు కోసం మనం.అనే సందేశాన్ని ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం సందేశాలు పంపుతున్నారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333