రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

జోగులాంబ గద్వాల 19 జూన్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : ఎర్రవల్లి. మండల కేంద్రంలోని రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగినది. అలంపూర్ మాజీ శాసనసభ్యులు ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్ ఎ సంపత్ కుమార్ ఆదేశాల మేరకు ఎర్రవల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అందేబోయిన వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జరపడం జరిగినది. ఆయా గ్రామాల నాయకులు మండల పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఒకరికొకరు కేకు తినిపించుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ...దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న నియంత ప్రభుత్వంపై రాజీ లేని పోరాటం చేస్తున్న పోరాట యోధుడు, భారత రాజకీయాల్లో నైతిక విలువలకు, ప్రజాస్వామ్యానికి, యువత ఆశయాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మన ఆదర్శ నాయకుడు,శ్రీ రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచుకోవడం మనందరి బాధ్యతగా భావించాలని అన్నారు. మీ సేవా దృక్పథం, ప్రజల పట్ల మీ నిబద్ధత, నిజాయితీతో కూడిన నాయకత్వం దేశానికి మార్గదర్శకం. ఈ పుట్టినరోజు సందర్భంగా మీరు ఆరోగ్యంగా, ఆయురారోగ్యాలతో, మీ ఆశయ సాధనలో మరింత ముందుకెళ్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం అంటూ అలంపూర్ నియోజకవర్గం ఎర్రవల్లి మండల కేంద్రంలోని ఎర్రవల్లి కూడలి నందు జరపడం జరిగినది.
ఈ కార్యక్రమంలో ఎరవల్లి మండల పార్టీ అధ్యక్షులు వెంకటేష్ యాదవ్, సోమనాద్రి, అంజి, తిమ్మారెడ్డి, మద్దిలేటి, ఆదాము, నరసింహులు, వెంకటేష్, అల్లబకాస్, మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.