రాష్ట్ర బడ్జెట్ లో విద్యా రంగం పై చిన్న చూపు

- డిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రేపాక లింగయ్య

Mar 20, 2026 - 20:59
 0  1
రాష్ట్ర బడ్జెట్ లో విద్యా రంగం పై చిన్న చూపు

రాష్ట్ర బడ్జెట్ లో విద్యా రంగం పై చిన్న చూపు
విద్యకు 8.22శాతం నిధులు సరికాదు
పెండింగ్ బిల్లులు, పిఆర్సీ ప్రస్తావన లేకపోవడం విచారకరం.
ఉద్యోగుల ఆరోగ్య పథకం క్రింద ఉచిత వైద్యం స్వాగతిస్తున్నాం.
- డిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రేపాక లింగయ్య.

 2026 - 27 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన రూ 3,24,234 కోట్ల బడ్జెట్ లో విద్య, మానవ వనరులకు కేటాయించింది26,674 కోట్లు మాత్రమే. ఇది మొత్తం బడ్జెట్లో 8.2%. ఉదయం అల్పాహారం, ఇంటర్ వరకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఆహ్వానించిందగిందే.  గత సంవత్సరం కంటే రూ 3,566 కోట్లు అదనంగా కేటాయించినప్పటికీ పెంచిన మొత్తం బ్రేక్ ఫాస్ట్, ఇంటర్ వరకు మధ్యాహ్న భోజన పథకం విస్తరణ, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు కోసమే సరిపోవచ్చు. అన్ని పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుదల గురించి, మధ్యాహ్నభోజనం నాణ్యత పెంపుగురించి అదనపు నిధుల కేటాయింపు ప్రస్తావన లేదు. గత సంవత్సరం 7.58 శాతం కేటాయించగా, ఈ సంవత్సరం 8.22 శాతం కేటాయించారు. విద్యకు 15% కేటాయిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్న హామీ వరుసగా 3వ బడ్జెట్లో కూడా నెరవేరలేదు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ను సమీక్షించి కనీసం 15% కేటాయించాలని డిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రేపాక లింగయ్య డిమాండ్ చేశారు.

ఉద్యోగుల ఆరోగ్య పథకానికి అయ్యే ఖర్చు మొత్తం రూ 1056 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే భరించి ఉద్యోగులకు, పెన్షనర్లకు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు డిజిటల్ హెల్త్ కార్డులపై నగదు రహిత వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని ఆయన స్వాగతించారు.అదే సందర్భంలో తెలంగాణ రెండో పీఆర్సీ అమలు గురించి గానీ, అదనపు నిధుల కేటాయింపు గురించి గానీ బడ్జెట్ లో మాట మాత్రంగానైనా ప్రస్తావించకపోవడం ఉద్యోగ, ఉపాధ్యాయులను నిరాశకు గురిచేసింది. ఇప్పటికే పిఆర్సీ అమలు 33 నెలలు ఆలస్యమైంది. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో మంచి పిఆర్సీ అమలు చేస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని 27 నెలలు గడుస్తున్నా నిలబెట్టుకోకపోవడం విచారకరం. పెండింగ్ డిఎలు, పెండింగ్ బిల్లులు, 2024 మార్చి నుండి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు గురించి ప్రస్తావనే లేదు.

రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సీ, పెండింగ్ బిల్లులు, బకాయిల గురించి కూడా స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333