రాష్ట్రంలో మూడు రోజులు రిజిస్ట్రేషన్ సేవలు బంద్
రాష్ట్రంలో నేటి నుంచి 3 రోజుల పాటు స్టాంపులు & రిజిస్ట్రేషన్ల శాఖ అన్ని సేవలను నిలిపివేసింది. డిపార్ట్మెంట్ వెబ్సైట్, అనుబంధ ఆన్లైన్ సేవలకు సంబంధించి సర్వర్ నిర్వహణ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇవాళ మొహర్రం, 28న ఆదివారం సెలవులే కాగా 27న పనిదినం. ఈ ఒక్కరోజు చెల్లింపుల సేవకు అంతరాయం కలగనుంది.
ఈనెల 29 నుంచి యథావిధిగా సేవలు స్టార్ట్ అవుతాయని అధికారులు తెలిపారు.