కోరుట్ల ఉమర్ మస్జిద్ ఖబ్రిస్తాన్ లో  హైమాస్ లైట్స్ పనిచేయడం లేదు 

Aug 11, 2026 - 01:40
Aug 11, 2026 - 01:40
 0  1
కోరుట్ల ఉమర్ మస్జిద్ ఖబ్రిస్తాన్ లో  హైమాస్ లైట్స్ పనిచేయడం లేదు 
కోరుట్ల ఉమర్ మస్జిద్ ఖబ్రిస్తాన్ లో  హైమాస్ లైట్స్ పనిచేయడం లేదు 

పట్టించుకోని కౌన్సిలర్, మున్సిపల్ కమిషనర్

 తీవ్రంగా ఖండించిన ఎం ఐ ఎం వార్డ్ ఇంచార్జ్ అబ్దుల్ రహీం 


కోరుట్ల 11 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- కోరుట్ల పట్టణంలోని నాలుగోవ  వార్డ్ మోమిన్ పుర లో గల ముస్లిం మతానికి చెందిన  మస్జిద్ ఏ ఉమర్ కలదు, ఇట్టి మస్జిద్ కాంపౌండ్ ఆవరణలో విశాల మైన ముస్లిం స్మశాన వాటిక ఖబ్రిస్తాన్ (బడా తకియ) కలదు, ఇట్టి ముస్లిం ఖబ్రిస్తాన్ లో స్ట్రీట్ లైట్స్ మరియు హైమాస్ లైట్స్ కలవు, ఇందులో దాదాపు 12 హై మాస్ లైట్స్ గత కొద్ది కాలం నుండి పనిచేయడం లేదు రాత్రి వేళల్లో చనిపోయిన ముస్లిం ప్రజలకు ఇట్టి ఖబ్రిస్తాన్ లో అంతిక్రియలు నిర్వహించుటకు గాను వచ్చే ప్రజలకు చీకటి వలన చాలా ఇబ్బందులు కలుగుచున్నవి, వర్షాకాలం ఉన్నందున ఇట్టి ఖబ్రిస్తాన్ లో పిచ్చి మొక్కలు ఎక్కువగా అవడం వలన పాములు విషపు పురుగుల భయానికి ఇట్టి స్మశాన వాటికలో వెళ్లడానికి ముస్లిం ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు, ఇట్టి విషయమై వార్డ్ కౌన్సిలర్ గారికి తెలియజేసిన కానీ వారి తరఫున ఎలాంటి స్పందన లేదు మరియు ఇట్టి విషయమై 4వ వార్డ్ ఎంఐఎం పార్టీ ఇంచార్జ్ అబ్దుల్ రహీం పార్టీ పట్టణ అధ్యక్షులు ఎం ఏ  రఫీ గారి ఆదేశాల మేరకు స్వయంగా మునిసిపల్ కమిషనర్ కోరుట్ల గారికి సంప్రదించగా వారి తరఫున కూడా ఎలాంటి స్పందన లేదని మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్ మరియు కమిషనర్ తీరుపట్ల అబ్దుల్ రహీం తీవ్రంగా ఖండిస్తూ ప్రజా సమస్యలపై తక్షణమే చర్యలు తీసుకోని ప్రజలకు సహాయ సహకారాలు అందించే వారి తీరు ఇలా ఉంటే సామాన్య ప్రజల జీవితాలు ఎలా బాగుపడతాయని వీరి నిర్లక్ష్యం కేవలం వార్డ్ కి సంబంధించిన స్మశాన వాటికకు కాదని ఇది కోరుట్ల పట్టణ ముస్లిం సమాజాం పట్ల నిర్లక్ష్యమని ఆయన అన్నారు, ప్రజల సమస్యలు పరిష్కరించే హోదాలో ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించకుండా గాలికి వదిలేస్తున్న మున్సిపల్ కౌన్సిలర్, కమిషనర్ ఇకనైనా తమ ఆలోచనలను మార్చుకొని ముస్లిం ఖబ్రిస్తాన్ లో నీ హై మాస్ లైట్స్ అమార్చాలని, ఖబ్రిస్తాన్ ఆవరణలో గల పిచ్చి మొక్కలను తొలగించాలని మరియు పట్టణ ప్రజలు కు మంచి సేవలు అందించాలని వారి సమస్యల పట్ల తక్షణమే చర్యలు చేపడుతూ వారికి సకాలంలో సేవలు అందించాలని లేనియెడలో ఎంఐఎం పార్టీ పట్టణ అధ్యక్షులు ఎం ఏ రఫీ గారి నాయకత్వంలో ఎం ఏ రహీం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333