రాయల్ పుడ్ కోర్ట్ కు 5 వేల రూపాయలు పెనాల్టీ... 

Jul 13, 2024 - 21:31
Jul 13, 2024 - 21:34
 0  4
రాయల్ పుడ్ కోర్ట్ కు 5 వేల రూపాయలు పెనాల్టీ... 

సూర్యపేట.13 జులై 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- సూర్యపేట పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ శరభమ్మ హోటల్  ప్రాంతంలో గల రాయల్ ఫుడ్ కోర్ట్ పరిసరాల లోపల అపరి పరిశుభ్రంగా ఉన్నందున మున్సిపల్ కమీషనర్ బి.శ్రీనివాసు ఆదేశాల మేరకు సానిటరీ అధికారులు,జవాన్లు, సిబ్బంది తనిఖీ చేసి రాయల్ పుడ్ కోర్టు యాజమాని జానీపాషా కు 5వేల రూపాయలు పెనాల్టీ వేశారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ పట్టణంలో హోటల్స్ యాజమాన్యాలు,పెట్టి వెండర్స్ వ్యాపారం చేసే వారు ఎవరైనా తమ పరిసరాలను,హోటల్స్ లోపల పరిశుభ్రంగా ఉంచుకోవాలని మురిగి,పులిసి పోయిన,నిల్వ ఉంచిన పదార్ధాలను వాడిన అట్టి హోటల్స్ ను సీజ్ చేయడంతో పాటు భారీ మొత్తంలో పెనాల్టీలు వేయడం జరుగుతుందన్నారు. హోటల్స్ చుట్టూ ప్రక్కల వారికీ ఇబ్బంది కలగకుండా వ్యాపారం చేసుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ లు సారగండ్ల శ్రీనివాస్,బూర సతీష్,హెల్త్ అస్సిటెంట్ మాస్కపురం సురేష్ ,జవాన్లు, ములకలపల్లి పరుశురాములు, పిడమర్తి ప్రసాద్ ,దండు ఉపేందర్ , జి.మల్లేష్,తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333