రాజీ మార్గమే.. రాజమార్గం! రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసుల్లో రాజీ పడవచ్చు""సూర్యాపేట జిల్లా ఎస్పీ కే నరసింహం ఐపీఎస్

సెప్టెంబర్ 13 న జరగనున్న జాతీయ లోక్-అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి.
రాజీ మార్గమే.. రాజ మార్గం! రాజీపడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో రాజీ పడవచ్చు.
తెలంగాణ వార్త ప్రతి నిధి రా వెళ్ళ: జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసుల్లో కక్షిదారులు రాజీపడవచ్చు క్షణికావేశంలో జరిగిన తప్పులను సరిదిద్దు కోవడానికి రాజీమార్గమే... రాజమార్గం! కావున సెప్టెంబర్ 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ గారు తెలిపారు.
సెప్టెంబర్ 13న జరగనున్న జాతీయ లోక్- అదాలత్ ను ఉద్దేశించి ఎస్పీ గారు మాట్లాడుతూ.... క్షణికావేశంలో చేసే తప్పులను సరిదిద్దుకోవాడానికి లోక్-అదాలత్ అనేది ఒక మంచి అవకాశం అని, అనవసర గొడవలకు, పట్టింపులకు పోయి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోకూడదని, జిల్లా వ్యాప్తంగా నమోదైన, చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో కక్షిదారులు రాజీ పడుటకు జాతీయ లోక్ - అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
కానిస్టేబుల్ నుండి అధికారుల వరకు ప్రతి ఒక్కరు భాద్యతగా వ్యవహరించి, రాజీ పడదగిన కేసులలో ఇరువర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించి, వీలైనన్ని ఎక్కువ కేసులు రాజీ పడేలా చూడాలన్నారు. జాతీయ లోక్-అదాలత్ ద్వారా సత్వర పరిష్కారం జరుగుతుందని అవగాహన కల్పించాలని తెలిపారు. Ark-->