రక్షించాల్సిన పోలీసులతోనే రక్షణ లేని పరిస్థితి.
దళిత మహిళపై ఇంత దాష్టీకమా :- న్యాయ విద్యార్థి నాగేశ్వర్ రెడ్డి.
ఓవైపు మహిళలపై అత్యాచారాలు, మరోవైపు అవమానాలు దాడులు.
నేరం ఒప్పుకోవాలంటూ చిత్రహింసలకు గురి చేస్తారా...?.
పోలీసులు అసలు దొంగలను పట్టుకోలేక
దొరికిన వారిని ఇరికించే ప్రయత్నం చేస్తారా...?
ఇదేమీ ప్రజా పాలన...?
జోగులాంబ గద్వాల 5 ఆగస్టు 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను కాపాడాల్సిన పోలీసులే పోలీస్ స్టేషన్కు వచ్చిన కేసుల్లో విచారణ జరపాల్సింది మరిచి దొరికిన వారిని దొంగలుగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నారని న్యాయ విద్యార్థి నాగేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సైబరాబాద్ పరిధిలోని షాద్నగర్ పట్టణంలో అంబేద్కర్ కాలనీ లో రెండు వారాల కిందట దొంగతనం జరిగిందని చెబితే కేసు నమోదు చేసుకుని పక్కింట్లో ఉండే వారినివిచారణకు పిలిచారు. పక్కింట్లో ఉండే ఇద్దరు దంపతులు వారి కుమారుడిని (13 సంవత్సరాలు) అదుపులోకి తీసుకున్నారు. ఆమె భర్తను పంపించి ఆమెను ఆమె కుమారుడిని ఒకే దగ్గర ఉంచి వివరాలు సేకరించారు. నిజం చెప్పాలంటే చిత్రహింసలకు గురి చేశారంట కన్న కొడుకు ముందే తల్లిని కొడుతూ చిత్రహింసలు పెడుతూ వివస్త్రను చేస్తే బూటు కాళ్లతో తంతు దొంగతనం నేరం ఒప్పుకోవాలంటూ అరికాళ్లపై లబ్బర్ బెల్టుతో కొడుతూ ఆ మహిళ పట్ల అరాచకంగా ప్రవర్తించిన పోలీసు వారిని విధుల నుంచి తొలగించి బాధిత మహిళలకు న్యాయం చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దళితుల మీద దళిత మహిళల మీద రోజు రోజుకి దాడులు పెరుగుతున్నాయి ఇదేనా ఇందిరమ్మ పాలన ఇదేనా ప్రజా పాలన అని మండిపడ్డారు. సామాన్య ప్రజలను రక్షించాల్సిన పోలీసుల వల్లే ప్రజలకు రక్షణ లేని పరిస్థితి అసలు మన రాష్ట్రంలో ఏం జరుగుతుందని న్యాయ విద్యార్థి నాగేశ్వర్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బాధిత మహిళకు న్యాయం చేయాలన్నారు.