మృతుని కుటుంబానికి అండగా నిలిచిన గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు

Apr 22, 2024 - 16:33
 0  10
మృతుని కుటుంబానికి అండగా నిలిచిన గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు

తుంగతుర్తి, ఏప్రిల్ 21 తెలంగాణ వార్త ప్రతినిధి:- మండల పరిధిలోని వెంపటి గ్రామానికి చెందిన గోరోజు అశోక్ (30) ఇటీవల మృతి చెందగా నిరుపేద కుటుంబానికి గ్రామస్తులు, మృతుడి పదవ తరగతి స్నేహితులు మేమున్నామంటూ అండగా నిలిచారు. మృతుడికి వృద్ధాప్యంలో ఉన్న తల్లి, నానమ్మ ఉన్నారు. ఎలాంటి ఆస్తిపాస్తులు లేని నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని వెంపటి గ్రామ వాట్సాప్ సోషల్ మీడియాలో ఆ గ్రామ యువకులు పోస్ట్ చేయగా గ్రామస్తులు, మృతుడి స్నేహితులు మనస్సుతో స్పందించి తమకు ఉన్నంతలో తల కొంత వేసుకొని 1,29,150 రూపాయలు,3 క్వింటాళ్ల బియ్యం  బాధిత కుటుంబ సభ్యులకు ఆదివారం గ్రామస్తులు అందజేశారు. నిరుపేద కుటుంబానికి ముందుకు వచ్చి వారు ఆర్థిక సహాయం అందజేయడమే కాకుండా గ్రామస్తులతో మమేకమై అండగా నిలిచిన  స్నేహితులను, గ్రామస్తులను మండల పరిధిలోని పలు గ్రామాల ప్రజలు అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో  ఉద్యోగస్తులు,పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333