మున్సిపాలిటీకౌన్సిలర్ కు వీడుకోలు సన్మానం
మిర్యాలగూడ, 25 జనవరి 2005 తెలంగాణవార్త ప్రతినిధి:- ఈరోజు మిర్యాలగూడ మున్సిపల్ కౌన్సిల్ పదవీకాలం నేటితో ముగియనుండతో ఏర్పాటు చేసిన మిర్యాలగూడ కౌన్సిల్ సాధారణ సమావేశంలో పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్ శ్రీ అమిత్ నారాయణ , కౌన్సిలర్స్ అందరికీ సన్మానం చేసి వీడ్కోలు శుభాకాంక్షలు తెలియజేశారు..
ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల తమ పదవి కాలంలో మిర్యాలగూడ పట్టణ అభివృద్ది కోసం కృషి చేసిన మిర్యాలగూడ మున్సిపల్ కౌన్సిలర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు తమ పదవుల్లో మరొకరు కౌన్సిల్ బాధ్యతలు స్వీకరించేవరకు మీకు దక్కాల్సిన గౌరవం మీకు ఉంటుంది అని అన్నారు పదవులు ఉన్నా లేకున్నా పట్టణ అభివృద్ది విషయంలో తమ సలహాలు సూచనలు ఎల్లపుడూ ఇవ్వగలరని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, కమిషనర్, కౌన్సిలర్స్ మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు..