మున్సిపల్ ఏఈ సస్పెన్షన్..!

అయిజ మున్సిపాలిటీలో ఏఈగా పనిచేస్తున్న రాజశేఖర్ సస్పెండ్ చేస్తున్నట్లు గద్వాల కలెక్టర్ సంతోష్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణంలోని పలు వార్డులకు సరఫరా అయ్యే మిషన్ భగీరథ నీరు అపరిశుభ్రంగా ఉన్నాయని ప్రజలు ఇటీవల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నీటిని ల్యాబ్కు పంపారు. నీరు కలుషితం అవుతున్నాయన్న ల్యాబ్ రిపోర్ట్ మేరకు సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.