ముగిసిన గ్రామసభలు ఊపిరి పీల్చుకున్న అధికారులు..

తెలంగాణవార్త ఆత్మకూరు యస్ ముగిసిన గ్రామసభలు ఊపిరి పీల్చుకున్న అధికారులు.. ప్రజా వ్యతిరేకత ఆందోళనలతో చుక్కలు చూసినా అధికారులు.. ఆత్మకూర్ ఎస్. ప్రభుత్వం చేపడుతున్న నాలుగు సంక్షేమ పథకాలపై గత నాలుగు రోజులుగా నిర్వహించిన గ్రామసభలు శుక్రవారంతో ముగిశాయి. గ్రామాల్లో గత ఏడాది కాలంగా సంక్షేమ పథకాలు నత్త నడకన కొనసాగడంతో సంక్షేమ పథకాలపై గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభలు అధికారులకు తలనొప్పిగా మారాయి. గత ఐదేళ్లుగా కొత్త పెన్షన్లు రాకపోవడం, 11 ఏళ్లుగా రేషన్ కార్డులు రాకపోవడం కార్డులో కొత్త పేర్లు చేర్చకపోవడం, రైతుబంధు రాకపోవడం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించకపోవడం, ఇలాంటి పథకాలు గ్రామాల్లో కొనసాగకపోవడంతో గ్రామాలకు వచ్చిన అధికారులపై ప్రజలు మండిపడ్డారు. సంక్షేమ పథకాలు ఇస్తామంటూ ప్రచారం చేసుకోవడం తప్ప ఏ ఒక్క పథకం అమలు చేయకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల కోసం ఫిర్యాదుల విలువ పెరిగింది. గత నాలుగు రోజులు గ్రామాల్లో కొనసాగిన గ్రామసభ ల కారణంగా అధికారులు ప్రజల నుండి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముగింపు రోజు జరిగిన గ్రామసభలు మండలం లో నీ ఏపూరు, ఆత్మకూరు, రామోజీ తండా, ముక్కుడుదేవులపల్లి, ఏపూర్ తండా, పాతర్ల పహాడ్ , మిడతనపల్లి,గ్రామాల్లో నిర్వహించారు.కాగా గ్రామ సభలు పాల్గొన్న ప్రజలు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక జాబితాలో రాజకీయ నాయకులు అవకతవకలకు పాల్పడ్డారని అధికారులపై మండి పడ్డారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్ మండలాధికారులు తాసిల్దారు హరిచంద్ర ప్రసాద్ ఎంపీడీవో హసీమ్ ఎంఇఓ దారాసింగ్,వ్యవసాయ అధికారిని దివ్య సూపర్నెంట్ వెంకటాచారి, ఎంపీఓ రాజేష్ ,వివిధ శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.