Srsp కాలువ నీళ్లు వదలకపోవడంతో రైతులు ఆగ్రహం

Mar 24, 2025 - 20:09
Mar 24, 2025 - 20:36
 0  6
Srsp కాలువ నీళ్లు వదలకపోవడంతో రైతులు ఆగ్రహం

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ పంట పొలాలకు నీళ్లు ఇవ్వడంలో అధికారుల నిర్లక్ష్యం రైతుల మధ్య చిచ్చులు పెడుతున్న అధికారులు. అన్ని ప్రాంతాలకు సమానంగా నీళ్లివ్వాలంటూ రాస్తారోకో.. పోలీసులు 36ఎల్ కు నీళ్ళొదలడo తో ఆందోళన విరమణ.. ఆత్మకూర్ ఎస్.. రబీ సీజన్లో వరి పంటకు నీళ్లు ఇవ్వలేమని ప్రభుత్వం చెప్పకుండా నేతలు మోసం చేయగా వచ్చే కొద్ది నీటిని రైతులకు అందించడం లో అధికారులు పక్షపాతం నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ నీళ్లు అందక పంట చేతికొచ్చేసమయంలో నీళ్లు రావడం లేదంటూ రైతులు ఆందోళన కు దిగారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండలం కోటి నాయక్ తండ వద్ద సూర్యాపేట దంతాలపల్లి రోడ్డు పై srsp కాల్వ వద్ద సోమవారం రాస్తారోకో నిర్వహించారు. వారబంది ప్రకారంగా గోదావరి జలాలు ఇస్తామని చెప్పిన అధికారులు మెయిన్ కాలువ నుండి 2రోజులు 22ఎల్ కాలువకు, 2రోజులు 36ఎల్ కు, 2రోజులు మెయిన్ కాలువ ద్వారా పెపహాడ్ వైపు నీళ్లు వదలాల్సి ఉండగా అధికారులు నిర్లక్ష్యం చేయడం తో ఎవరికిస్తం వచ్చినట్లు వారు గేట్లు తీసి నీటిని మళ్లించడం తో మిగతా ప్రాంతాల పంట పొలాలు ఎందుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే సగానికి పైగా వరి పొలాలు ఎండి పోగా మిగతా పొలాలు కోత దశకు వచ్చాయని కనీసం ఆ కొద్ది నీటితో పొలాలు కాపాడాలని కోరారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా గత నాలుగు రోజుల మేల్ కెనాల్కు నీళ్లు వెళ్తున్న 36 ఎల్ కెనాల్ కు నీళ్లు రాకపోవడంతో ఆ ప్రాంతానికి చెందిన రైతులు నిరసన వ్యక్తం చేస్తూ కలెక్టర్ రావాలంటూ నినాదాలతో ఆందోళన చేశారు. స్థానిక ఎస్ ఐ శ్రీకాంత్ గౌడ్ సమాచారం తెలుసుకొని సంఘటనా స్థలానికి చేరుకునీ ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు.ఇరిగేషన్ ఏఈ సురేష్ వెంటనే క్రేన్ తెప్పించి 36యల్ కాలువ గేట్లు ఎత్తివేసి మెయిన్ కెనాల్ గేట్లను మూసివేశారు 36ఎల్ కాలువ ఆత్మకూర్ ఎస్ తో పాటు చివేంల మండలం లోని కొన్ని గ్రామాలకు నీళ్లు వెళ్ళడం తో రైతులు ఆందోళన విరమించారు. *వేతనాలు అలవెన్సులు వచ్చినా విధులకు హాజరు కాని ఇరిగేషన్ అధికారులు.* రవి సీజన్లో గోదావరి జలాలు అందించడం ప్రభుత్వం విఫలం కాగా వచ్చిన కొద్ది నీటిని రైతులకు అందించటలో ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. భారీ వేతనాలతో పాటు అలవెనుసులు వస్తున్నప్పటికీ కనీసం కాలువల్లో వచ్చే నీరు ఎటు వెళ్తున్నాయి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అని చూసుకునే పరిస్థితులు లేరు. కింది స్థాయిలో వర్క్ ఇన్స్పెక్టర్లు తప్ప ఏఈ నుండి డి ఈ, ఈ ఈ,లు కూడా కాలువలో నీటిని పరిశీలించేందుకు సుముఖంగా లేరని తెలుస్తుంది. నీళ్లు సక్రమంగా అందకపోవడంతో రైతుల ఒత్తిడి జరుగుతుందని రావడం లేదా లేక ఇతర వ్యాపకాలు ఉండి మీకు సరఫరాను పరిశీలించడం లేదని విమర్శలు వస్తున్నాయి. వారబంది ప్రకారం నీళ్లు ఇస్తున్నప్పటికీ ఇంజనీరింగ్ శాఖకు సంబంధించిన అధికారులు నెలకు ఒకసారి కూడా కాలువలువైపు కన్నీటి చూడలేదని విమర్శలుస్తున్నాయి. కనీసం రైతులు ఆందోళనకు దిగిన ఉన్నత స్థాయి ఇంజనీరింగ్ శాఖ అధికారులు స్పందించడం లేదని రైతుల ఆందోళన చేస్తున్నారు. గత రెండు నెలలుగా ఆత్మకూరు మండలంలో ప్రతి వారబంది సమయంలో నీళ్ల పంపిణీలో అధికారులు నిర్లక్ష్యం పక్షపాతం ,ఇస్తున్నారని రైతులు వందలాదిమంది రోడ్డుపై రాస్తారోకోలు ఆందోళన చేస్తున్నప్పటికీ ఏ ఒక్క అధికారి సంఘటన స్థలానికి చేరుకోవడం లేదు. కోటి నాయక్ తండ వద్ద మెయిన్ కెనాల్ కు ఉన్న గేట్లకు ఏకంగా వెల్డింగ్ లో చేసిన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అధికారులు నిర్లక్ష్యానికి పరాకాష్టగా మారింది. భారీ వేతనాలతో పాటు ఇతర అలవెన్స్ కారు అలవెన్స్ కింద ఒక అధికారికి 35 నుంచి 40 వేల రూపాయలు వస్తున్నాయని నెలలో ఒకసారైనా కాలువలను పరిశీలించేందుకు రావడంలేదని రైతులు ఆరోపణ చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ నిర్వహించి కాలువల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.