మిషన్ ఆత్మ నిరార్భరత ఇన్ పల్సస్ కార్యక్రమం.
జోగులాంబ గద్వాల 17 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఇటిక్యాల మండలం లోని ఉదండాపురం గ్రామ రైతు వేదిక నందు ఏ ఈ ఓ ఆధ్వర్యంలో మిషన్ ఆత్మ నిర్భారత ఇన్ పల్సెస్ కార్యక్రమం లో రైతులు కు ఉదండాపురం గ్రామంలో శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏఓ, రవికుమార్ మాట్లాడుతూ ఈ పథకం ద్వారా మండలం లో కంది విత్తనాలు సబ్సిడీ పై పంపిణీ చేయడం జరిగింది. మరియు మినుములు అందుబాటులో ఉన్నాయని గ్రామంలోని రైతులకు తెలియజేశారు. రైతులు పంట మార్పిడి చేయవలసిన అవసరం ఉందని రైతులకు ఆవాహన కల్పించడం జరిగింది . ఈ కార్యక్రమంలో ఏవో రవికుమార్ వ్యవసాయ విస్తరణ అధికారి జెన్నిఫర్, సర్పంచ్ , ఉప సర్పంచ్ మరియు రైతులు పాల్గొన్నారు.