మాలిపురంలో వడదెబ్బ పై అవగాహన

తిరుమలగిరి 06 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మున్సిపల్ పరిధిలోని మాలిపూరం, మండల పరిధిలోని బండ్లపల్లి గ్రామంలో వడ దెబ్బ గురించి సామాజిక అరోగ్య అధికారి మాలోతు బిచ్చు నాయక్ అవగాహణ కల్పించారు.ఈ వేసవిలో పనికి వెళ్ళే వారు ఉదయం 10 గంటల లోపు సాయంత్రం 4 గంటల తరువాత పనికి వెళ్ళాలని సూచించారు.అత్యవరమైతే మధ్యాహ్నం సమయంలో గొడుగు, టోపి, తెల్లని కాటన్ దుస్తులు ధరించాలని,తరుచుగా మంచినీళ్ల త్రగాలని,ORS ద్రావణం తీసుకోవాలని, తెలిపారు. ఇంట్లో దొరికే మజ్జిగ,నిమ్మరసం, తీసుకోవాలి , అత్యవసమైతే ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో లలిత, రజిత, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.