మానవత్వం చాటుకున్న దయా సహృదయుడు
ప్రభుత్వ అంబులెన్స్ అందుబాటులో లేకపోవడం సిగ్గుచేటు

ఇంకా మారని పరిస్థితికి కారణం ఎవరు? ఈ పాపం ఎవరిది?
బీ ఆర్ ఎస్ ములుగు నియోజకవర్గ, జిల్లా నాయకులు భూక్య జంపన్న.
ములుగు జిల్లా బ్యూరో
సెప్టెంబర్ 19 (తెలంగాణ వార్త ):
ఏటూరు నాగారం మండలం ఆకులవారి గణపురం కు చెందిన కంకణాల గీతిక (6) వరంగల్ ఎం జీ ఎం హాస్పిటల్ లో విష జ్వరంతో బాధపడుతూ గురువారం ఉదయం మృతి చెందింది. మృతదేహాన్ని తరలించేందుకు ప్రభుత్వ అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో తల్లిదండ్రులు మృతదేహాన్ని 3 గంటలకు పైగా చేతులపై ఎత్తుకొని ఎదురు చూశారు. పలువురు రాజకీయ నాయకులకు చెప్పినా ఫలితం లేకుండా పోయింది. విషయం తెలుసుకున్న బీ ఆర్ ఎస్ ములుగు నియోజకవర్గ, జిల్లా నాయకులు భూక్య జంపన్న హుటా హుటిన అక్కడికి చేరుకొని మృతదేహాన్ని తరలించేందుకు స్తోమత లేని దిక్కు తోచని పరిస్థితులలో ఉన్న కడు బీద కుటుంబాన్ని చూసి చలించిపోయిన జంపన్న ఈ సందర్భంగా మాట్లాడుతూ
78 ఏండ్ల స్వాతంత్ర్య భారతదేశంలో ఇంకా మారని పరిస్థితి కి కారణం ఎవరు? ఈ పాపం ఎవరిది? పరిపాలించే పాలకులది కదా? కనీసం ప్రభుత్వ అంబులెన్స్ అందుబాటులో లేకపోవడం సిగ్గుచేటని, ఇలాంటి సంఘటనలు జరిగిన సందర్భాలు లేకపోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆ కుటుంబానికి అండగా నిలబడి తన సొంత ఖర్చులతో ప్రవేట్ అంబులెన్స్ ఏర్పాటు చేసి మానవత్వాన్ని చాటుకున్నాడు.