మరపురాని మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి..

Sep 2, 2024 - 20:51
 0  5
మరపురాని మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి..

మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్

మరపురాని మహానేత దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి అని మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్ అన్నారు.సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రెడ్ హౌస్,కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి,కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఆదేశాల మేరకు కక్కిరేణి శ్రీనివాస్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి ని ఘనంగా నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.ఈ సందర్భంగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి  శ్రీనివాస్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పేద ప్రజలకు ఎన్నో పథకాలు అమలు చేసి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన గొప్ప వ్యక్తి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరు పనిచేయాలన్నారు.ప్రజలకు చేరువయ్యే పలు సంక్షేమ పథకాలు ప్రారంభించి చెరగని ముద్ర  వేసుకున్నారన్నారు. ఇప్పుడున్న ప్రతి నాయకుడు ఆయన అడుగుజాడల్లో నడవాలని, అలాంటి పరిపాలన అందించిన ఆయన మన మధ్య లేకపోవడం దురదృష్టకరమని తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ చెంచల శ్రీనివాస్, కౌన్సిలర్ వేముల కొండ పద్మ, రావుల రాంబాబు,అన్నమయ్య రాము,నాగుల వాసు, పందిరి మల్లేష్, రుద్రంగి రవి,మధుకర్,బొడ్డు సాయి, దివ్య,రాంబాయమ్మ,  తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333