మన ప్రజా శక్తి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన మందకృష మాదిగ
తెలంగాణ వార్త సూర్యపేట 2026-01-31:
పట్టణ కేంద్రంలో శనివారం నాడు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మన ప్రజా శక్తి 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు.మన ప్రజా శక్తి క్యాలెండర్ ఆవిష్కరణలో భాగంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ
నేటి సమాజంలో పత్రికల పాత్ర చాలా కీలకమైందని, సమాజానికి, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పత్రికలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని పత్రికలకు స్వేచ్ఛ చాలా ముఖ్యమని, వివిధ పత్రికలలో పనిచేసే జర్నలిస్టులకు, పత్రికలకు స్వేచ్ఛ ఉండాలని అన్నారు.ఎవరికి భయపడకుండా నిజాన్ని నిర్భయంగా, నిస్సంకోచంగా, వార్తలు రాసి నిజ నిజాలను నిగ్గు తేల్చాల్సిన అవసరం పాత్రికేయులపై ఉందన్నారు.ప్రజలందరి ఆదరాభిమానాలతో పత్రికా రంగంలో నూతన ఒరవడితో అనధికాలంలోనే విశ్వసనీయమైన సమాచారాన్ని అందించే పత్రికల్లో మన ప్రజా శక్తి పత్రిక ఒకటి అని తెలిపారు మన ప్రజా శక్తి పత్రిక యజమాన్యానికి సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు మామిడి శంకర్, గుడపూరి ప్రభాకర్, దుర్గం బాలు, చింత సతీష్, ఎమ్మార్పీఎస్ నాయకులు చింతలపాటి చిన్న శ్రీరాములు, యాతాకుల రాజన్న తదితరులు పాల్గొన్నారు.