మంత్రి నిధులతో విద్యుత్ లైన్ ల మళ్లింపు

Mar 16, 2024 - 18:59
Mar 16, 2024 - 20:01
 0  8
మంత్రి నిధులతో విద్యుత్ లైన్ ల మళ్లింపు

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్:- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిధులతో విద్యుత్తు లైను మళ్లింపు ఆత్మకూర్ ఎస్ .... మండల పరిధిలోని ముక్కుడు దేవులపల్లి గ్రామంలో విద్యుత్ 11 కెవి లైను ఇళ్ల పై నుండి, పాఠశాల పైనుండి వెళుతుండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ప్రత్యేక నిధులతో శనివారం విద్యుత్తు లైన్ మళ్లింపు కార్యక్రమం చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా ఎందరో పాలకులకు తమ బీసీ ఎస్సీ కాలనీ ల లో ఇళ్ల పై ఉన్న విద్యుత్ లైన్ సమస్యను చెప్పిన పట్టించుకోలేదని మాజీ మంత్రి దామోదర్ రెడ్డి సహకారంతో ఆరు లక్షల రూపాయల నిధులతో ఇళ్లపై ఉన్న 11 కెవి విద్యుత్తు లైను సమీపంలోని ఎస్సారెస్పీ కాలువ వెంట మళ్ళించారు. విద్యుత్తులైన్ మళ్లింపుకు సహకరించిన మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి మాజీ మంత్రి దామోదర్ రెడ్డికి గ్రామస్తులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు ఇరుగు మనిషా మధుకర్, ఫాతిమా ఫయాజ్ ,మందడి రాఘవరెడ్డి, మల్లారెడ్డి , ఇరుగు లచ్చయ్య, వెంకన్న, బిక్షం,తదితరులు పాల్గొన్నారు.