నాలుగు రోజులలో దొంగతనం కేసును చేదించిన గద్వాల్ పోలీసులు.
ఇద్దరు నిందితులు అరెస్ట్, నిందితుల నుండి 9 తులాల బంగారం, 60 తులాల వెండి స్వాధీనం.
జోగులాంబ గద్వాల 15 జూన్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- మేస్త్రి పని చేస్తూ వస్తున్న డబ్బులు సరిపోవడం లేదని ఎలాగైనా ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్యేశం తో ఇంటి తాళం పగలగొట్ట 9 తులాల బంగారం, 60 తులాల వెండి నీ దొంగలించిన కేసును నాలుగు రోజులలో చెధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి నుండి 9 తులాల బంగారు, 60 తులాల వెండి ను పోలీసులు స్వాధీనం చేసుకువడం జరిగింది.
1.Accused persons Details.
A1. Mahabubu S/o Khaja Husain Age: 19 Years, Caste: Muslim, Occu: Welding Work, R/o Chenugonipally Village of Gadwal Mandal.
Cr.no: 139/2026 u/s331(3),305 BNS, GADWAL TOWN PS
2.నేరం చేసిన విధానం. మెహబూబ్ వెల్డింగ్ పని చేస్తూ జీవించేవాడు. ఇతనికి ఇంకో వ్యక్తితో స్నేహం ఉండేది. వీరిద్దరూ వీరు చిన్నతనం నుండి వారి గ్రామంలో ఒకటే స్కూల్లో చదువుకున్నారు, ఇద్దరు వారి గ్రామం నుండి గద్వాల కు వచ్చి పనులు చేసుకునేవారు, అయితే వారికి పనిచేయడం వలన వచ్చే డబ్బులు సరిపోనందున అప్పుడప్పుడు చిన్న చిన్న దొంగ తనాలు చేసేవారు, వారు ప్రతిరోజు గద్వాల పట్టణం లోని భీం నగర్ ప్రక్కల ఉన్న కాలువ వెంబడి వారి గ్రామం నుండి గద్వాల కు వచ్చేవారు అలా వస్తున్న సమయంలో వారు కాలువ ప్రక్కల ఉన్న ఒక తాళం వేసిన ఇంటిని రెండు రోజుల నుంచి గమనించి ఎలాగైనా ఆ ఇంట్లో దొంగతనం చేయాలని ఉద్దేశంతో తేదీ 10.06.2026 నాడు ఉదయం 11:50 సమయంలో వారు మోటార్ సైకిల్ మీద భీమ్ నగర్ కు వచ్చి అక్కడ ఇంటి వెనకాల మోటర్ సైకిల్ ను ఆపి, వారి వెంట తెచ్చుకున్న ఒక రాడ్డు తీసుకొని ఇంటి తాళం విరగొట్టి ఇంట్లోకి వెళ్లి బీరువాలో ఉన్న 1. పొడవైన గొలుసు - 3.5 తులాల, 2. మంగళసూత్రం - 2.5 తులాల, 3. జుంకాలు - 1 తులం (ఒక జత), 4. చెవి రింగులు - 0.5 తులం (ఒక జత), 5. సైడ్ ఇయర్ రింగ్స్ - 0.25 తులం (ఒక జత), 6. చిన్న పిల్లల ఉంగరం - 2 గ్రాములు, 7. పెద్ద ఉంగరం - 0.5 తులం, 8. ముక్కు పుల్ల - 1 గ్రాము, అలాగే 60 తులాల వెండి మరియు రూ. 7,000 నగదు దొంగతనం చేసుకొని వారు చెరుసగం దాచి పెట్టుకున్నారు. వారి ఇళ్ళలో పెడితే వారి తల్లిదండ్రులు చూస్తారని, వారి వెంటే పెట్టుకొని తిరుగుచున్నారు.
3.స్వాదినం చేసుకున్నా వస్తువులు:
1. పొడవైన గొలుసు - 3.5 తులాల, 2. మంగళసూత్రం - 2.5 తులాల,
3. జుంకాలు - 1 తులం (ఒక జత), 4. చెవి రింగులు - 0.5 తులం (ఒక జత),
5. సైడ్ ఇయర్ రింగ్స్- 0.25 తులం (ఒక జత), 6. చిన్న పిల్లల ఉంగరం - 2 గ్రాములు,
7. పెద్ద ఉంగరం - 0.5 తులం, 8. ముక్కు పుల్ల - 1 గ్రాము,
9. 60 తులాల వెండి (మార్కెట్ విలువ ఆOధాజ 15 లక్షలు) 10.దొంగతనం కు ఉపయోగించిన బైక్.
4.నేరము ను చేదించిన విధానము: శ్రీ టి. శ్రీనివాస రావు,IPS , సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జోగుళాంబ గద్వాల జిల్లా వారి ఆదేశాల మేరకు శ్రీ కె.శంకర్అదనపు ఎస్పీ, జోగుళాంబ గద్వాల జిల్లా, శ్రీ y.మొగిలయ్య డిఎస్పి గద్వాల స్వియ పర్యవేక్షణలో టంగుటూరి శ్రీను సిఐ గద్వాల్ , కల్యాణ్ ఎస్సై గద్వాల్ టౌన్ పిఎస్, ఆద్వర్యంలో ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేసి CC కెమెరాలు, ఇతర సాంకేతిక మరియు నైపుణ్యం ఆదారంగా నిందితులను గుర్తించి ఈ రోజు తేదీ 15.06.2026 ఉదయం అందాజ 10:30 గంటల సమయం లో గద్వాల పట్టణం శివారు లోని చెనుగొనిపల్లికి వెళ్ళు రోడ్డులో కలువ ప్రక్కల వేచి ఉండగా చేనిగొని పల్లి కి చెందిన మహబూబ్ మరియు మరో వ్యక్తి నిమోటార్ సైకిల్ పై రాగా వారిని అదుపులోకి తీసుకొని వారినుండి పై వస్తువులు స్వాదినం చేసుకోవడం జరిగింధి. ఈ కేసును ఛేదించడం లో ప్రతిభ చూపిన గద్వాల సిఐ టి. శ్రీను, కల్యాణ్ ఎస్సై గద్వాల్ టౌన్ పిఎస్, పి.సిలు చంద్రయ్య, కిరణ్, రామకృష్ణ లను జిల్లా SP ప్రత్యేకంగా అబినధించారు.