మానవత్వం చాటుకున్నహోప్ స్వచ్ఛంద సేవా సమితి రంగారెడ్డి జిల్లా కోఆర్డినేటర్ నీరుడు విజయ్
యల్ బి నగర్ 15 జూన్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- హైదరాబాద్ మహానగరంలో కూకట్పల్లికి చెందిన సూర్యనారాయణ రాజు ఆదివారం రాత్రి మూసాపేట నుండి కూకట్పల్లికి కారు క్యాబ్ బుక్ చేసుకున్నారు కూకట్పల్లిలో దిగి వెళ్ళిపోయారు. తన ఐఫోన్ సుమారు 1,50,000 లక్షల రూ.లు (అక్షరాల ఒక లక్ష యాభై వేల రూపాయలు) విలువగల మొబైల్ ఐ ఫోన్ ను కారులో మరిచిపోయారు. సోమవారం ఉదయం చరవాణి ద్వారా సమాచారం తెలుసుకొని వారికి క్యాబ్ డ్రైవర్ నీరుడు కు ఫోన్ చేసి మాట్లాడారు ఫోను (మొబైల్) నా దగ్గరే ఉన్నది అని తెలిపారు. సూర్యనారాయణ రాజు మిత్రుడు సతీష్ రెడ్డి కి ఇవ్వగలరని తెలిపారు. వెంటనే హోప్ స్వచ్ఛంద సేవా సమితి మరియు సింధు ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు సామాజిక కార్యకర్త డాక్టర్ దైద వెంకన్న(Daida Venkanna) ఆధ్వర్యంలో ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో జందార్ వేణుగోపాల్ చేతుల మీదుగా సూర్య నారాయణరాజు అనుమతితో (మిత్రుడు) సతీష్ రెడ్డి కి మొబైల్ ఐ ఫోన్ ను (చరవాణి) అందజేశాము. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్ మాట్లాడుతూ మానవత్వం చాటుకున్న నీరుడు విజయ్ ను హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్ మరియు స్వచ్ఛంద సంస్థల ఫౌండర్ చైర్మన్ డాక్టర్ దైద వెంకన్నలు ప్రత్యేకంగా అభినందించారు. ఉపాధ్యక్షులు కత్తుల వెంకన్నను స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సామాజిక సేవలను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలన్నారు.