ప్రియమైన విద్యార్థులకు పోలీసు వారి సూచన

Jun 15, 2026 - 15:28
 0  0

పాఠశాలలు ప్రారంభమై నూతన విద్యా సంవత్సరంలో అడుగు పెడుతున్న ప్రియమైన విద్యార్థులకు సూర్యాపేట జిల్లా పోలీసు శాఖ తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నాను. విద్యార్థులు కొత్త ఉత్సాహం, కొత్త ఆశలతో విద్యాలయాలలో అడుగు పెడుతున్నారు మీ రక్షణ మా బాధ్యత. స్వేచ్చగా చదువుకోవాలి, ఉపాద్యాయులు నేర్పే పాఠాలు శ్రద్ధగా నేర్చుకోవాలి, కష్టపడి చదువుకోవాలి. తోటివారితో స్నేహంగా ఉండాలి, చెడు అలవాట్లకు గురి కావద్దు. 

మీ లక్ష్యాలను చేరుకోవడానికి మరియు ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవడానికి జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించండి:

- రోడ్డు ప్రయాణంలో అప్రమత్తత:* పాఠశాల లేదా కళాశాలకు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు ట్రాఫిక్ నియమాలను పాటించండి. రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, వాహనాలను నడిపేటప్పుడు ఏకాగ్రతతో వ్యవహరించండి.
- సోషల్ మీడియాకు దూరం: విద్యా సంవత్సరంలో మీ సమయం చాలా విలువైనది. సోషల్ మీడియాలో అనవసరమైన సమయాన్ని గడపడం వల్ల చదువుపై దృష్టి తగ్గుతుంది. మీ లక్ష్యంపై పూర్తి దృష్టి పెట్టండి.
- దురలవాట్లకు స్వస్తి: డ్రగ్స్ మరియు ఇతర వ్యసనాలకు దూరంగా ఉండండి. ఇవి మీ ఆరోగ్యాన్ని, భవిష్యత్తును పూర్తిగా నాశనం చేస్తాయి. చెడు స్నేహాలకు దూరంగా ఉండి, మంచి అలవాట్లను పెంపొందించుకోండి.
* *సైబర్ భద్రత:* తెలియని వ్యక్తుల నుండి వచ్చే లింక్‌లను క్లిక్ చేయవద్దు. వ్యక్తిగత వివరాలను, బ్యాంక్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి.

మీ ఉన్నత లక్ష్యాల సాధనలో క్రమశిక్షణే మీ అసలైన ఆయుధం. ఈ విద్యా సంవత్సరం మీకు విజయవంతం కావాలని ఆశిస్తున్నాను.

ఇట్లు..
మీ శ్రేయోభిలాషి,
కె. నరసింహ, ఐపిఎస్.
ఎస్పీ సూర్యాపేట జిల్లా.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333